Life Expectancy : ఆయుష్షును పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందరికీ ఉంటుంది. అందుకోసం చాలామంది మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇంకొందరు మంచి వ్యాయామం చేస్తుంటారు. ఇంకొందరు ఇవి రెండూ ఫాలో అవుతుంటారు. మనం ఇవాళ ఇలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకొని మన ఆయుష్షును(Life Expectancy) పెంచుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
చిన్న చేపలు తింటే ఏమవుతుంది..
- చిన్న చేపలు తింటే మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని జపనీస్ అధ్యయనం చెబుతోంది.
- చిన్న చేపలను పాస్తా, సలాడ్స్, శాండ్ విచ్, వంటి వాటిలో చేర్చుకొని తినొచ్చు.
- చిన్న చేపలను పెద్ద వయస్కులు ముళ్లతో సహా తింటే మంచిదని అంటారు. ఆ ముళ్లు మెత్తగా ఉండటంతో ఈజీగా జీర్ణం అవుతాయని చెబుతారు.
- చిన్న చేపల్లో క్యాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని తింటే ఎముకలకు, కళ్లకు మంచిది.
- చిన్న చేపల్లో మినరల్స్ కూడా ఉంటాయి.
- బ్రెయిన్ పవర్‌ను పెంచే ఒమేగా 3 యాసిడ్స్ కూడా చిన్న చేపల్లో ఉంటాయి.
- చిన్న చేపల్లో కాలుష్య కారకాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
- పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర తక్కువే.
Also Read :Shahrukhs House : బాలీవుడ్ బాద్‌షా ఇంట్లో ఉండే ఛాన్స్ .. రెంట్ ఎంతో తెలుసా ?
రాత్రి వ్యాయామం చేస్తే..
సాయంత్రం 6 గంటల తర్వాత వ్యాయామం చేయడం మంచిదని గ్రెనడా యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ టైంలో జిమ్ చేస్తే ఊబకాయం సమస్య తగ్గుతుందని గుర్తించారు. బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లోకి వస్తాయని ఈ స్టడీలో తేలింది. సాయంత్రం వ్యాయామం చేస్తే డయాబెటిస్ పేషంట్లకు చాలామంచిదని పరిశోధకులు తెలిపారు.
Also Read : Donations : ‘అన్నా క్యాంటీన్ల’కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత
మురికి దుస్తులు
ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండటానికే ప్రయారిటీ ఇస్తుంటారు. నీట్‌గా ఉండే దుస్తులే ధరిస్తుంటారు. కొంతమంది అతిగా శుభ్రతను పాటిస్తూ రోజులో చాలాసార్లు బట్టను మార్చేస్తుంటారు. కొంతమంది ఒకసారి వేసుకున్న దుస్తులను పదేపదే ఉతికేస్తుంటారు. ఇలాంటి అలవాట్లకు వ్యక్తిగత పరిశుభ్రత అనే ట్యాగును తగిలిస్తుంటారు. వాస్తవానికి ఒకసారి దుస్తులు ఉతికితే సరిపోతుందని అమెరికాలోని ఓ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది.