Big Shock : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్లు చేస్తున్నారా ? ‘రీప్లేస్‌మెంట్’ ఇక టఫ్ గురూ

Big Shock : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు బిగ్ షాక్ ఇది. ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వాటి రీప్లేస్‌మెంట్ పాలసీలో పెద్ద మార్పును చేశాయి.

  • Written By:
  • Updated On - February 16, 2024 / 02:42 PM IST

Big Shock : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు బిగ్ షాక్ ఇది. ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వాటి రీప్లేస్‌మెంట్ పాలసీలో పెద్ద మార్పును చేశాయి. మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువు పాడైతే దాన్ని వెంటనే మార్చలేరు. ఒక వస్తువును కొని దాన్ని మార్చడం ఇకపై కొంత ప్రాసెస్‌తో కూడుకొని ఉంటుంది. ఈ కంపెనీలు 7 రోజుల్లో వస్తువుల మార్పిడి పాలసీని నిలిపివేశాయి. గతంలో ఈ కంపెనీలు దెబ్బతిన్న లేదా నాసిరకం వస్తువులను రీప్లేస్ చేసుకోవడానికి యూజర్లను అనుమతించేవి. ఈ పద్ధతికి బదులుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఇప్పుడు సర్వీస్ సెంటర్లకు మార్గం చూపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లు తాము ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా రిసీవ్ చేసుకున్న వస్తువును మార్చాలనుకుంటే.. నేరుగా సేవా కేంద్రాన్ని సందర్శించాలి.  రీప్లేస్‌మెంట్ చేయదల్చుకున్న వస్తువును ఆ సర్వీస్ సెంటర్లో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కొత్త ప్రోడక్ట్‌ తిరిగి వచ్చే వరకు సర్వీస్ సెంటర్లను సందర్శిస్తూ ఉండాలి. దానితోనే టచ్‌లో ఉండాలి. ఇది వరకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్  కస్టమర్లు ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా వస్తువులను మార్పిడి చేసుకునేవారు. ఇకపై ఆ సౌకర్యం యూజర్లకు ఉండబోదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు 7 రోజుల ‘డైరెక్ట్ రీప్లేస్‌మెంట్’ నిబంధనను.. 7 రోజుల ‘సర్వీస్ సెంటర్ రీప్లేస్‌మెంట్‌‌’లోకి మార్చేశాయి. దీని వల్ల కస్టమర్లకు రీప్లేస్‌మెంట్  ప్రక్రియ కొంత కష్టంగా(Big Shock) మారే అవకాశం ఉంటుంది.

Also Read : Father – Son – Sperm : భార్యను ప్రెగ్నెంట్ చేసేందుకు.. తన స్పెర్మ్‌ను తండ్రి స్పెర్మ్‌తో కలిపాడు

మారనున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రీప్లేస్‌మెంట్ పాలసీ ప్రకారం.. యూజర్లు ఇకపై ఏదైనా వస్తువు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు సమీపంలోని సర్వీస్ సెంటర్ లొకేషన్ సమాచారాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆర్డర్ ద్వారా రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్‌‌లో లోపం ఉందని గుర్తిస్తే.. వెంటనే సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించాలి. ఆ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ప్రోడక్ట్ నాణ్యతపై ఫిర్యాదు చేయాలి. స్వయంగా ఆ వస్తువును వాపసు చేయాలి. ప్రోడక్ట్‌ రీప్లేస్‌మెంట్  ఎప్పటిలోగా జరుగుతుందనే సమాచారం ఆ సర్వీస్ సెంటర్‌లోనే యూజర్లకు లభిస్తుంది. ఈ విధానం వల్ల వినియోగదారులకు విపరీతమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వారు అదనంగా సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ పాలసీ ఎఫెక్టుతో రానున్న రోజుల్లో ఆన్‌లైన్ ఆర్డర్లు తగ్గుముఖం పడతాయని పరిశీలకులుే అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా కొనే వస్తువు సరిగ్గా లేకుంటే.. దాని రీప్లేస్‌మెంట్ అనేది వ్యయ, ప్రయాసలతో కూడుకొని ఉంటుందనే అంశం యూజర్లను ఆర్డర్ ఇచ్చే దిశగా వెళ్లనివ్వదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.