1.5 Crore IT Notices : కోటిన్నర మందికి ఐటీ నోటీసులు.. ఆ 6 ట్రాన్సాక్షన్లు చేశారా ?

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు.

  • Written By:
  • Updated On - February 4, 2024 / 03:43 PM IST

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. అలాంటి వారిపై ఇప్పుడు ఐటీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ విధంగా పన్ను కట్టకుండా ఉండిపోతున్న దాదాపు 1.5 కోట్ల మందికి నోటీసులు పంపిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు.  1 కోటి రూపాయలకుపైగా విలువ చేసే పన్ను వివాదాల పరిష్కారానికి కర్ణాటకలోని మైసూర్ లో డిమాండ్ మేనెజ్మెంట్ సెంటర్‌ను 2022లోనే  ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలో వారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మందిపు అధికారులు, పన్ను చెల్లింపుదారులను ఒక చోట చేరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ సెంటర్ అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం 2.50 లక్షల వివాదాలను పరిష్కరించిందని ఆయన తెలిపారు.  కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా రూ.25 వేల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణపై సీబీడీటీ ఓ సర్క్యులర్ జారీ చేయనుందని నితిన్ గుప్తా(1.5 Crore IT Notices) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

6 ట్రాన్సాక్షన్లు చేస్తే.. ఐటీ నోటీసులు రావొచ్చు

పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సరైన అవగాహన లేక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం కంటే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే ఐటీ విభాగం గమనించదని భావిస్తారు. కానీ ఆ అంచనా తప్పు. ముఖ్యంగా 6 రకాల లావాదేవీల నిర్వహిస్తున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది.

  • రూ.30 లక్షలు అంత కంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తులు అంటే ఇల్లు, భూమి కొనుగోళ్ల వంటివి చేసినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఆ వివరాలను ఐటీ శాఖకు తెలియజేస్తుంది.
  • ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 10 లక్షలు, అంతకు మించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి తెలియ జేయాలి. మీ క్రెడిట్ కార్డు వివరాలు పాన్ కార్డుతో లింకై ఉంటాయి. దీంతో మీ ట్రాన్సాక్షన్లను ఎప్పటికప్పుడు ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తారని గుర్తుంచుకోవాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల అంత కంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేసుకోవడం వంటివి చేస్తే ఐటీ శాఖకు వాటి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది.
  • రూ. 10 లక్షలు ఆపైన చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను ఐటీ విభాగానికి తెలియ జేయాలి. మరోవైపు.. ఒకటి కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులే ఐటీ శాఖకు వివరాలు అందిస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, లేదా డిబెంచర్లలో రూ. 10 లక్షలు అంత కంటే మించి పెట్టుబడి పెట్టినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు ఇవ్వాలి. లేకుంటే మీకు నోటీసులు వస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువ గల విదేశీ కరెన్సీతో లావాదేవీలు నిర్వహించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు తెలియ జేయాలి. వాటిని దాచాలని చూస్తే మీకు నోటీసులు వస్తాయి.