Site icon HashtagU Telugu

Rajasthan To Telangana : రాజస్థాన్ నుంచి తెలంగాణకు సోలార్ పవర్.. ‘నోఖ్రా ప్రాజెక్టు’ విశేషాలివీ

Rajasthan To Telangana

Rajasthan To Telangana

Rajasthan To Telangana : తెలంగాణ రాష్ట్రానికి ఇకపై పెద్దఎత్తున సోలార్ పవర్ కూడా అందనుంది. ఇందుకోసం ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో 1,550 ఎకరాల్లో  300 మెగావాట్ల నోఖ్రా సోలార్‌ ప్రాజెక్టును నిర్మించింది. దీని నిర్మాణానికి  సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ స్కీంలోని ఫేజ్‌– ఐఐలో భాగంగా రూ.1,803 కోట్ల పెట్టుబడిని కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 13 లక్షల పైచిలుకు సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌‌ను వాడారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 73 కోట్ల యూనిట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇవాళ ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ వర్చువల్ మోడ్‌లో జాతికి అంకితం చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలోని 1.3 లక్షలకుపైగా ఇళ్లలో వెలుగులు

నోఖ్రా సోలార్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని(Rajasthan To Telangana) 1.3 లక్షలకుపైగా ఇళ్లలో వెలుగులు నిండుతాయని ఎన్టీపీసీ అంటోంది. ప్రతి సంవత్సరం 6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను నియంత్రించడంలో ఇది హెల్ప్ చేస్తుందని పేర్కొంది. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న సోలార్ ప్లాంట్ల ద్వారా  3.4 గిగావాట్ల సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తోందని వెల్లడించింది. 26 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని ఎన్‌టీపీసీ తెలిపింది.

Also Read : Congress Bank Accounts : కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. 210 కోట్లు జామ్!

సోలార్ సైకిళ్లు రెడీ

సోలార్ సైకిళ్లను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతీయులు తయారు చేస్తున్నారు. ఈ సైకిళ్లను బరోడా ఎలక్ట్రిక్ మీటర్స్ లిమిటెడ్ కంపెనీ అభివృద్ది చేస్తోంది. వల్లభ్ విద్యానగర్ లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయం(BVM)  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో వరల్డ్ వైడ్ ఫస్ట్ సోలార్ సైకిల్ రోలౌట్, డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పేరుతో ఈ  ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సోలార్ సైకిల్ రూపకల్పనకు ఇప్పటికే చాలాచోట్ల అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్యపరమైన ఉత్పత్తి. మెహతా, హితార్థ్ సోలంకి, ముస్తఫా మున్షీ, రుషీ షా అనే నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రెండు సంవత్సరాల క్రితం సోలార్ సైకిల్ నమూనాను అభివృద్ధి చేశారు.  సోలార్ సైకిల్ కు మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ ఛార్జ్ కంట్రోలర్‌ను, 40 వాట్ల సోలార్ ప్యానెల్ ను అమర్చారు. ఎండ బాగా ఉంటే  180W బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయడానికి 5 గంటల టైం పడుతుంది. సోలార్ సైకిల్ 12 వోల్ట్లు, 40 వోల్ట్ తక్కువ వోల్టేజీల వద్ద పనిచేస్తుంది. అలాగే ఈ-సైకిల్ లకు వన్ టైమ్ ఛార్జ్ మెకానిజం కారణంగా 5Ah(ఆంపియర్ గంట) బ్యాటరీ సరిపోతుంది.