Krishna Water Share : కేసీఆర్, జ‌గ‌న్ `మిలాక‌త్` కు కృష్ణా వాటాతో కేంద్రం చెక్

Krishna Water Share : ఏపీ, తెలంగాణకు కృష్ణా వాటాను తేల్చే ప్ర‌క్రియ‌ను ట్రిబ్యున‌ల్ కు అప్ప‌గిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 04:07 PM IST

Krishna Water Share : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కృష్ణా జలాల వాటాను తేల్చే ప్ర‌క్రియ‌ను ట్రిబ్యున‌ల్ కు అప్ప‌గిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అన్న‌ద‌మ్ముల్లా ఉన్న కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెర‌చాటు వ్య‌వ‌హారం ఇప్పుడు బ‌య‌ట ప‌డ‌నుంది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి ప‌రోక్షంగా స‌హ‌కారం అందించిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాయ‌ల‌సీమ‌ను ఏడారిగా మార్చేశార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. గోదావ‌రి న‌దిపై కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌దీ జ‌లాల వాటాపై నోరెత్త‌లేదు. ఇప్పుడు కృష్ణా జ‌లాల వాటాపై కేసీఆర్ చేస్తోన్న జిమ్మిక్కుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్డుకోవ‌డంలేద‌న్న విమ‌ర్శ ఉంది.

కృష్ణా వాటాను తేల్చే ప్ర‌క్రియ‌ను ట్రిబ్యున‌ల్ కు కేంద్ర క్యాబినెట్ (Krishna Water Share)

విభ‌జ‌న చ‌ట్టంలో పొంద‌ప‌రిచిన దానికి భిన్నంగా 50-50 వాటాను తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దానిపై స‌వాల్ చేయాల్సిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రైన విధంగా స్పందించ‌డంలేద‌ని తొలి నుంచి విప‌క్షాల నుంచి ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. బచావత్‌ ‘ట్రిబ్యునల్‌ ను అనుసరించి ఏపీ ,తెలంగాణ వాటాల‌ను 66:34 నిష్పత్తినే కొనసాగించాలి. కానీ, వాటా పెంచాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వం గత ఏడాది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో రిజర్వాయర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ)కి లేఖ రాసింది. దీంతో ప‌లుమార్లు ఆర్‌ఎంసీ సమావేశమైనా కృష్ణా జలాల పంపిణీపై (Krishna Water Share ) ఏకాభిప్రాయం కుదరలేదు.

ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌నం అనంతరం బచావత్‌ టైబ్యునల్‌ అవార్డు ప్రకారం ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను తిరగదోడటం చట్టరీత్యా సాధ్యం కాదని ఏపీ స్పష్టం చేస్తోంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2015 జూలై 19న కేంద్ర జలశక్తి ముందు కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తి వాటాలపై ఏపీతో పాటు తెలంగాణ అధికారులు సంతకాలు చేశారు. ఆ మేరకు బచావత్‌ టైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల గణాంకాలను లెక్కకట్టి ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు (Krishna Water Share ) కేటాయించారు.

Also Read : Krishna river: కృష్ణా జ‌లాలపై కేసీఆర్ `50-50` సెంటిమెంట్‌

బచావత్‌ టైబ్యునల్‌ కేటాయింపులను సరిచేసే అధికారం ఎవరికీ లేదనీ, బ్రజేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటయిన కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కెడబ్ల్యుడీటీ-2) తుది తీర్పు వెలువడే వరకు ఇవే కేటాయింపులు వర్తిస్తాయని ఏపీ వాదిస్తోంది. రెండు రాష్ట్రాల్ర మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంలో సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం కేడబ్ల్యుడీటీ -2కు సైతం పూర్వ కేటాయింపులకు జోలికి వెళ్ళే అధికారం లేదు. నీటి లభ్యత 65-75 శాతం ప్రాతిపదికన లెక్కించినపుడు అదనపు జలాలను రెండు రాష్ట్రాల‌కు కేటాయించేందుకు బ్రజేష్‌ కుమార్‌ టైబ్యునల్‌ పరిమితమవుతుందన్న సంగతిని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న 50:50 నిష్పత్తిని సమ్మతించే ప్రస్తక్తే లేదని.(Krishna Water Share ) ఏపీ చెబుతోంది.

ఎప్పటి లెక్క అప్పుడే..! (Krishna Water Share )

ఒక ఏడాదిలో ఏ కారణం వల్లనైనా కృష్ణాలో కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోని పక్షంలో క్యారీ ఓవర్‌ జలాలను మరుసటి సంవత్సరం వాడుకునేలా వెసులుబాటు కల్పించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుండగా ఏపీ వ్యతిరేకిస్తోంది. క్యారీ ఓవర్‌ జలాలను మరుసటి ఏడాది కలపటం సాంకేతికంగా సాధ్యం కాదని బోర్డు చెబుతోంది. దీనిపై కేంద్ర జల సంఘం కూడా క్యారీ ఓవర్‌ జలాలను లెక్కించి మరుసటి సంవత్సరం వినియోగించునే విధానాన్ని అంగీకరించటం లేదు. అంతేకాకుండా కృష్ణా జలాల్లో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకునే నీటిలో 20 శాతమే లెక్కించాలనీ, రాజోలుబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) కుడి కాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలనీ, ఆర్డీఎస్‌ అధునీకరణ పనులు చేపట్టాలని  (Krishna Water Share )డిమాండ్‌ చేస్తోంది.

Also Read.  : Krishna River : జ‌గ‌న్ పై kCR ఆప‌రేష‌న్, స‌రే అంటే కృష్ణా వాటా ఔట్ !  

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు మరిన్ని టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ వాదనను ఏపీ తిప్పికొడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎగువ నుంచి తరలించేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగీరథ, కల్వకుర్తి (సామర్థం పెంపు), నె-్టట-ంపాడు (సామర్థం పెంపు) ప్రాజెక్టు పనులు చేస్తోందని ఏపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో 66:34 నిష్పత్తి వాటాలను అమలు చేయటమే కాకుండా తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకోవాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది.

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89తో రాష్ర్టానికి ఒరిగేది శూన్యమంటూ ఆది నుంచీ సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదన‌. కృష్ణా జలాల పంపిణీపై ఇటీవల విచారించిన ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ కూడా ఈ విషయాన్ని తేల్చార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 ఒక్కటే ఇప్పుడు దిక్కైంద‌ని గుర్తు చేస్తోంది.

తొలుత ఆమోదించి.. ఆపై వెనకడుగు

ఏపీ పునర్విభవజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం కృష్ణా, గోదావరి జలాలను కేవలం ప్రాజెక్టుల వారీగానే పంపిణీ చేయాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. అలా చేస్తే తమకు ఒరిగేదీ ఏమీ ఉండదని, పరీవాహాక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలను తేల్చాలని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్‌ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై 14న వినతిపత్రం అందచేసింది. కేంద్రమాత్రం కాలయాపన చేయ‌డంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరుగుతుండగానే న్యాయశాఖ సలహాతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నవంబరు 17, 2015లో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ మూడు వారాల్లోపే మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోని కేంద్రం చివరికి 6 అక్టోబర్‌ 2020లో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించినా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని షరతు పెట్టింది. తెలంగాణ స‌ర్కార్ అందుకు అంగీక‌రించడంతో ట్రైబ్యున‌ల్ కు నీటి వాటాలను (Krishna Water Share )తేల్చాల‌ని కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది.

అధికారాల్లేవని తేల్చిచెప్పిన ట్రిబ్యునల్‌

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం తెలంగాణ- ఏపీ రాష్ర్టాలకు న్యాయమైన నీటి పంపకాలను చేసే అధికారాలు తమకు లేవని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌ 2 చైర్మన్‌ బ్రిజేశ్‌కుమార్‌ ఇటీవల తేల్చిచెప్పడంతో ఇప్పుడు తెలంగాణ తన న్యాయమైన నీటి వాటా పొందేందుకు అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ను న‌మ్ముకుంది. ప్ర‌స్తుత ట్రైబ్యున‌ల్ కు నీటి వాటాల‌ను తేల్చే అధికారం ఇవ్వ‌డంతో తెలంగాణ‌కు నీటి వాటాలు పెరిగే అవ‌కాశం ఉంది. దీనిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ధీటుగా పోరాడ‌గ‌ల‌దా? అంటే అస‌లు స్వ‌రూపం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ‌నుంది.