BRS Defeat – Reasons : ఎన్నికల రేసులో కారుకు బ్రేక్ వేసిన అంశాలివే..

BRS Defeat - Reasons : కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.

  • Written By:
  • Updated On - December 3, 2023 / 04:21 PM IST

BRS Defeat – Reasons : కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఆ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాలేకపోయింది. ఇంతకీ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమిటి ? అనేది ఓ సారి పరిశీలిద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల అహంకారం

2014 నుంచి దాదాపు అన్ని స్థానాల్లో పాత అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కంటిన్యూ చేయడం బీఆర్ఎస్‌కు మైనస్ పాయింట్‌గా మారింది. ఆ ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులు, వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను గులాబీ బాస్ పట్టించుకోలేదు. పలుచోట్ల టీఆర్ఎస్ నేతల అహంకార ధోరణి కూడా  ప్రతికూలంగా పనిచేసింది. అందుకే ‘పదేళ్ల అహంకారం పోవాలి’ అని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఫలించింది.

‘పాత’ నమ్మకం 

స్థానికంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని బరిలోకి దించితే 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్‌కు చెప్పినట్టు కేటీఆర్ ఇటీవల పేర్కొన్నారు. అయితే అభ్యర్థుల్ని మారిస్తే పార్టీలో ఇబ్బందులు వస్తాయన్న కారణంతో కేసీఆర్ సిట్టింగ్‌లతోనే కంటిన్యూ అయ్యారని చెబుతున్నారు. ఈ పెద్ద పొరపాటు బీఆర్ఎస్ ఓటమికి దారితీసింది. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్ అయింది.

బీజేపీ.. బీఆర్ఎస్..

కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయంతో తెలంగాణలో ఆ పార్టీ  క్యాడర్ యాక్టివ్ అయింది. బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను నిలువరించేందుకు లోపాయికారిగా చేతులు కలిపాయనే ప్రచారం కూడా మైనస్ పాయింట్ అయింది. ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్.. కాంగ్రెస్‌ను ఎక్కువగా టార్గెట్ చేయడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న భావన ప్రజల్లో కలిగింది.

కుటుంబ పాలన

కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు తీవ్రంగా పరిగణించారు. అందుకే చాలా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీకి అండగా నిలిచారు. కుటుంబ పాలనను అంతం చేయాలన్న కాంగ్రెస్ ప్రచారం బలంగా జనంలోకి(BRS Defeat – Reasons) వెళ్లింది. కుటుంబ రహితంగా నాయకులకు అవకాశం ఇచ్చే పార్టీ కోసం వెతికిన ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారు.

సంక్షేమ పథకాలు అందనివారంతా..

సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయని బీఆర్ఎస్ భావించింది. కానీ అలా జరగలేదు. దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల వంటి స్కీమ్స్ కొద్ది మందికే అందాయి. ఇవి అందని వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. ఈ యాంటీ ఓటింగే మొత్తం ఫలితాల సీన్‌ను మార్చేసింది. కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చింది. కొత్త ప్రత్యామ్నాయం కోరుకోబట్టే  ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 యువత ఆగ్రహం 

నీళ్లు, నిధులు, నియామకాలలో ఇంకా న్యాయం జరగాల్సి ఉందని రాష్ట్ర యువత భావించారు.ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదన్న ఆగ్రహం నిరుద్యోగుల్లో వ్యక్తమైంది. కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క కూడా ఈ స్థాయిలో ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం నిరుద్యోగ అంశమే. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కావడం, కొన్ని నోటిఫికేషన్స్‌కు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు విడుదల చేయలేకపోవడం, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారం వంటివన్నీ బీఆర్ఎస్‌కు మైనస్ పాయింట్లుగా మారాయి.

Also Read: Phone Switched Off: మీ ఫోన్ పోయిందా.. అయితే ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగలించిన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయవచ్చట?