Survey: డేంజర్ జోన్లో కేసీఆర్, జగన్ – సీ ఓటర్ సంచలన సర్వే

ఏపీ ,తెలంగాణ సీఎంలు జగన్మోహనరెడ్డి, కేసీఆర్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు.

  • Written By:
  • Updated On - October 25, 2022 / 11:50 AM IST

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత 60 శాతాన్ని దాటి వెళ్లారు. ఆ మేరకు సీ ఓటర్ సర్వే తేల్చటం గమనార్హం. ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి యాభై శాతం దాటిందంటే డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్టే భావించాలి. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ దేశంలోనే అత్యంత ‘రెడ్ జోన్‌’లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ప్రజలు వ్యక్తం చేయటంతో ఒకటో స్థానంలో ఉంది. సుమారు 66.80 శాతం మందికి పైగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ సర్కారుపై ఏపీలో 56.9 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న టాప్‌ – 5 ప్రభుత్వాల జాబితాలో తెలంగాణ ఒకటో స్థానంలో ఉండగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. అంటే తెలంగాణలోని 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ మేరకు సీ ఓటర్ సంస్థ సర్వేలో సంచలన విషయాలు బయట పెట్టింది.

ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ కోసం యాంగర్ ఇండెక్స్ పేరుతో సీ ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది. ‘ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు’ అన్న అంశంపై కాకుండా సిట్టింగ్ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఎంత మేర ప్రజాగ్రహానికి గురవుతున్నారని తెలుసుకోవడానికి ఈ యాంగర్ ఇండెక్స్ పేరుతో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో నిఖార్సయిన నిజాలను బయట పెట్టింది. దేశంలో అధికార పార్టీలపై ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకోబోతోందని హెచ్చరించింది.

ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న టాప్ 5 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది అంటే 66.8 శాతం మంది ప్రజలు కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నట్టు సంస్థ తెలిపింది. సీట్ల రూపంలో 79 సీట్లపైనా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read:   Mission 175: తిరుపతి లో రాయలసీమ గర్జన, మిషన్- 175 స్కెచ్

ఏపీలో 56.9 శాతం మంది ప్రజలు జగన్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. జనం అసంతృప్తిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా, 2,3 స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ నిలిచాయి. ఏపీలో 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ప్రజల నుంచి అతి తక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఎంల జాబితాలో ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాయిల్ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా 34.5శాతంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్. కేజీవాల్ పాలనపై 28శాతం మంది మాత్రమే ఆగ్రహంగా ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ 5వ స్థానంలో ఉన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ‘మోడి’పై తక్కువ వ్యతిరేకత ఉంది.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై జనంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ స్థానిక పాలనపై మాత్రం తీవ్ర అసంతృప్తి కనిపించింది. అలాగే తెలంగాణ స్థానిక పాలనపై 5.4 శాతం మాత్రమే అసంతృప్తి ఉంది. సర్వేలో పాల్గొన్న వాళ్ళల్లో చాలా మంది తమ రాష్ట్ర నాయకత్వాల కన్నా కేంద్ర మంత్రులపైనే ఎక్కువ నమ్మకం ప్రకటించారు. ప్రజలు ఇష్టపడిన ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ప్రధాని నరేంద్రమోడీపై ఛత్తీస్ గడ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లో తక్కువ అసంతృప్తి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి.

Also Read:   Vijayawada : బెజ‌వాడ‌లో నివాస ప్రాంతాల మ‌ధ్య బాణాసంచా దుకాణాలు.. పేలుళ్ల‌తో హ‌డ‌లెత్తుతున్న జనం

రాష్ట్రాలపై వ్యతిరేకత

దేశంలో కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు. ఐయాన్స్ – సీ టర్ సర్వే ఒపీనియన్ పోల్ లో తేలింది. 46.6శాతం మంది తమ రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 34.8శాతం మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అతి తక్కువ ఆగ్రహం ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగటున 24.6శాతం మంది ఓటర్లు తమ ముఖ్యమంత్రులపైన, 11.2శాతం మంది తమ ఎమ్మెల్యేలపైనా అసంతృప్తిగా ఉన్నట్టు తేలింది.

చాలా పరిమితమైన శాంపిల్

సీ ఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ సేకరించింది. దేశవ్యాప్తంగా కేవలం పాతిక వేల మంది అభిప్రాయాలను మాత్రమే తీసుకుంది. వారినే రాష్ట్రాల వారీగా విభజించి ఫలితాలను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యేల వల్లే పార్టీకి గడ్డు పరిస్థితులు వస్తున్నాయని, ఆయా పార్టీల అధినేతలు ఎమ్మెల్యేల్ని మందలిస్తున్నారు. కానీ విచిత్రంగా ప్రభుత్వంపైనే ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుతోంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజా వ్యతిరేకతను బాగా చవిచూస్తున్నారు.

Also Read:   MLA Seethakka: కోవర్ట్ రెడ్డిని పక్కన పెట్టాల్సిందే.. వెంకట్ రెడ్డిపై సీతక్క ఫైర్!