Site icon HashtagU Telugu

CAG Report :రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి.. రెవెన్యూ లోటు తక్కువ చూపారు: కాగ్ నివేదిక

Government Tabled The Cag Report On Kaleshwaram In The Assembly

Government Tabled The Cag Report On Kaleshwaram In The Assembly

 

Telangana Assembly Sessions 2024 : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదిక(CAG Report)లను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై, పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ ఇచ్చిన నివేదికను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సభ ముందు ఉంచారు. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని, విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.

“పనుల అప్పగింతలో నీటి పారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. డీపీఆర్‌ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారు. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం అయింది. సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51గా అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజె(Kaleshwaram project)క్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 0.75గా తేలుతోంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశముంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించారు.” అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన నివేదికను భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ఈ నివేదికలో రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి, రెవెన్యూ లోటు తక్కువ చూపారని కాగ్ పేర్కొంది. విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనకబడి ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో విద్య మీద కేవలం 8 శాతం, ఆరోగ్యం మీద 4 శాతమే ఖర్చు చేశారని నివేదికలో వెల్లడైంది. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదని తెలిపింది. విభజన ఆస్తుల పంపకాల విషయమై తగినంత దృష్టి లేదని చెప్పింది.

“రూ.1.18 లక్షల కోట్లు బడ్జెట్‌ వెలుపలి రుణాలను బడ్జెట్‌లో వెల్లడించలేదు. బడ్జెట్‌ వెలుపలి రుణాలు జీఎస్‌డీపీ అప్పుల నిష్పత్తిపై ప్రభావం ఉంటుంది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి వచ్చింది. రుణాలపై వడ్డీలకు 2032-33 నాటికి రూ.2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్థికభారం ప్రభుత్వాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుంది. బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చులో తగ్గుదల ఉంది.” అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

read also :Chandrababu : చంద్రబాబు ఇంటి వద్ద భారీ అగ్నిప్రమాదం