Jennifer Larson : స్వయంగా వీసా ఇంటర్వ్యూలు.. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ చొరవ

Consul General Jennifer Larson : మరోసారి ‘సూపర్ సాటర్ డే’‌ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో విజిటర్ వీసా కోరే వారికి స్పెషల్ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించారు.

  • Written By:
  • Updated On - April 20, 2024 / 02:42 PM IST

Jennifer Larson : మరోసారి ‘సూపర్ సాటర్ డే’‌ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో విజిటర్ వీసా కోరే వారికి స్పెషల్ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించారు. కాన్సులేట్‌కు చెందిన సిబ్బంది విజిటర్ వీసా దరఖాస్తుదారుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈదఫా సూపర్ సాటర్ డే ప్రత్యేకత  ఏమిటంటే.. స్వయంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ (Consul General Jennifer Larson) వచ్చి కౌన్సెలింగ్ కౌంటర్‌లో కూర్చున్నారు. విజిటర్ వీసాను కోరే కొంతమందిని ఆమె స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

సూపర్ సాటర్ డే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దాదాపు 1500 మంది విజిటర్ వీసా అప్లికేషన్లను సమర్పించినట్లు కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ శనివారం సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. ఈ వీసా పొందే వారు వ్యాపార అవసరాల కోసం, టూర్ చేయడానికి, కుటుంబ సభ్యులను కలవడానికి  అమెరికాకు వెళ్లనున్నారు.

Also Read :Mutton Chicken Shops : రేపు మటన్, చికెన్ షాపులన్నీ బంద్.. ఎందుకంటే ..?

జెన్నిఫ‌ర్ లార్సన్ నేపథ్యం ఇదీ.. 

  • జెన్నిఫ‌ర్ లార్సన్ 2022 సెప్టెంబరులో హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జ‌న‌ర‌ల్‌గా నియ‌మితుల‌య్యారు.
  • గ‌తంలో ఆమె ముంబైలోని యూఎస్ కౌన్సులేట్ జ‌న‌ర‌ల్‌లో డిప్యూటీ ప్రిన్సిప‌ల్ ఆఫీస‌ర్‌గా చేశారు.
  • ఇండియాకు తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా కూడా చేశారు.
  • కౌన్సుల్ జ‌న‌ర‌ల్ లార్స‌న్‌కు దౌత్య సంబంధాల్లో 19 ఏళ్ల అనుభ‌వం ఉంది.
  • గతంలో లిబియా, పాకిస్థాన్‌, ఫ్రాన్స్‌, సుడాన్‌, జెరుస‌లాం, లెబ‌నాన్ దేశాల్లోనూ అమెరికా కాన్సులేట్లలో ఆమె వివిధ హోదాల్లో ప‌నిచేశారు.
  • అమెరికా ఫారిన్ స‌ర్వీస్‌లో చేర‌డానికి ముందు.. కౌన్సుల్ జ‌న‌ర‌ల్ లార్స‌న్ అనేక చోట్ల ప‌నిచేశారు.
  • శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని నేష‌న‌ల్ ప‌బ్లిక్ రేడియోలో చేశారామె. అక్క‌డ టాక్ షో ప్రొడ్యూస‌ర్‌గా ఆమె త‌న విధులు నిర్వ‌ర్తించారు.
  • జెన్నిఫ‌ర్ లార్సన్ కాలిఫోర్నియాలో అండ‌ర్‌గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.