Site icon HashtagU Telugu

Case Registered Against Nandita PA Akash: ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై కేసు నమోదు

Case Registered Against Nandita PA Akash

Safeimagekit Resized Img 11zon

Case Registered Against Nandita PA Akash: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పీఏ ఆకాశ్ (Case Registered Against Nandita PA Akash) నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మృతికి కారణమయ్యాడంటూ సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పీఏ ఆకాశ్‌పై 304A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్ర‌మాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘ‌ట‌న త‌మ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోనే జ‌రిగింద‌ని ప‌టాన్‌చెరు పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని తెలిపారు. సుల్తాన్‌పూర్ వ‌ద్ద ముందు వెళ్తున్న టిప్ప‌ర్‌ను లాస్య నందిత వెళ్తున్న కారు ఢీకొట్టిందని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో కారు అదుపుత‌ప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: AP News: ఏపీ ఉద్యోగ సంఘాలతో సబ్ క్యాబినెట్ భేటీ, కీలక విషయాలపై చర్చ

ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత అల్పాహారం తినాలని షామీర్‌పేట్ వద్ద ORR ఎక్కి, సంగారెడ్డి వైపు వస్తుండగా సుల్తాన్‌పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత సుమారు 05:10 గంటల సమయంలో డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారుకోవడం వలన డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఎడమ వైపు ఉన్న ORR మెటల్ బీమ్‌కు బలంగా ఢీకొనడం వలన ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

తీవ్ర గాయాలైన‌ డ్రైవర్ ఆకాష్‌ను వెంటనే మదీనాగూడలో గల శ్రీకర్‌ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. నందిత సోద‌రి ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల సమక్షంలో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు.

We’re now on WhatsApp : Click to Join