Vehicle Motion Cues : కొంతమందికి కారు జర్నీ అంటే పడదు.. ఒకవేళ కారు జర్నీ చేస్తే కడుపులో తిప్పుతున్నట్లుగా, కళ్లు తిరుగుతున్నట్లుగా , వికారంగా ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి లక్షణాలున్న వారి కోసం అధునాతన టెక్నాలజీ సహకారంతో ఓ పరిష్కార మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
కారులో జర్నీ చేసే క్రమంలో వికారంగా ఫీలవడాన్ని ‘మోషన్ సిక్‌నెస్’ అంటారు. లవంగాలు, నిమ్మకాయలు, యాలకులను వాడి తాత్కాలిక ఉపశమనాన్ని పొందొచ్చు. కొంతమందికి నడుస్తున్న వాహనంలో ఉండగా ఫోన్ వైపు చూస్తే.. కళ్లకు నొప్పి కలుగుతుంది. కారు కదిలే వేగానికి అనుగుణంగా కళ్లు ఫోన్ స్క్రీన్‌పై నిలకడగా ఉండకపోవడంతో ప్రాబ్లమ్ ఎదురవుతుంది. అందువల్లే కళ్లు తిరుగుతాయి. ఈ సమస్యను తీర్చేందుకు యాపిల్ కంపెనీ ఓ పరిష్కారాన్ని తెచ్చింది. అదే ‘వెహికల్ మోషన్ క్యూస్’. ఐఫోన్లు, ఐపాడ్స్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Also Read :Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
‘వెహికల్ మోషన్ క్యూస్’ ఫీచర్ ఏమిటి ?
ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లలో స్క్రీన్ ఎడ్జ్‌లకు యానిమేటెడ్ డాట్స్ ఉంటాయి. వెహికిల్ కదలికల ఆధారంగా ఆ డాట్స్ కూడా కదులుతాయి. ఈ డాట్స్ sensory conflictను తగ్గిస్తాయి. దీనివల్ల వాహన కదలికలకు, మీ కళ్ల కదలికలకు మధ్య సింక్ కుదురుతుంది. అడ్వాన్స్‌డ్ సెన్సార్స్‌తో ఈ ఫీచర్‌ని డిజైన్ చేశారు. కదిలే వాహనంలో కూర్చున్నప్పుడు ఈ సెన్సార్‌లు యాక్టివేట్ అవుతాయి. దూర ప్రయాణం చేసిన టైంలో కళ్లు, చెవిలోపలి భాగాలతో పాటు మొత్తం శరీరం అసౌకర్యానికి గురవుతుంది. అయితే కొద్దిమందిలో ఈ సెన్సేషన్ తక్కువ. మరి కొందరిలో ఎక్కువ. దీనివల్లే కళ్లు, చెవులు మెదడుకు కొన్ని సంకేతాలు చేరి, బాడీపై ఆ ప్రభావం పడుతుంది. వికారం మొదలవుతుంది. కొందరికి వాంతులై డీహైడ్రేషన్‌కి గురవుతారు. ‘వెహికల్ మోషన్ క్యూస్’ (Vehicle Motion Cues) ఇలాంటి వారికి చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది.