WhatsApp Feature : యాపిల్, ఆండ్రాయిడ్‌‌కు పోటీగా వాట్సాప్ కొత్త ఫీచర్

WhatsApp Feature : వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

  • Written By:
  • Updated On - January 22, 2024 / 03:19 PM IST

WhatsApp Feature : వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మన ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్ పేరు AirDrop. యాపిల్ ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే ఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్ పేరు Quick Share . ఈ ఫీచర్లను తలపించేలా స్వయంగా ఒక ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. ఈ ఫీచర్ వివరాలు ఈ వారం ప్రారంభంలోనే WABetaInfo ద్వారా బయటికి వచ్చాయి. రెండు డివైజ్‌ల మధ్య ఫైళ్ల బదిలీ అనేది సాధారణంగా బ్లూటూత్ కనెక్టివిటీ సహాయంతో పని చేస్తుంటుంది. WhatsApp కూడా ఇదే పద్ధతిన కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.  ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. 2GB వరకు ఫైల్‌లను వాట్సాప్ యూజర్స్ అవలీలగా ఇతరులకు సెండ్ చేయొచ్చు. వాట్సాప్ ఛాట్ల ద్వారా ఫైళ్ల బదిలీకి ఈ కొత్త ఫీచర్ మార్గం సుగమం, వేగవంతం చేయనుంది.

We’re now on WhatsApp. Click to Join.

వాట్సాప్‌లో రాబోయే ఈ ఫీచర్(WhatsApp Feature) ద్వారా ఫైళ్ల బదిలీ చేయాలంటే కొంత ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫైల్ షేరింగ్‌ను ప్రారంభించడానికి ముందు రెండు ఫోన్‌లను షేక్ చేయాలి.  వాట్సాప్‌లోని షేర్ ఫైల్స్ విభాగంలోకి మిగతా వర్క్‌ను ఫైల్స్‌ను సెండ్ చేసే వ్యక్తి మొదలుపెట్టాలి. మరో డివైజ్‌కు  ఫైళ్ల బదిలీ పూర్తయ్యే వరకు మనం వాట్సాప్ ట్యాబ్‌ను తెరిచి ఉంచాలి. ఫైళ్లు బదిలీ అయ్యేటప్పుడు రెండు డివైజ్ల ఫోన్ నంబర్లు కనిపించవు.  వాట్సాప్‌లో కాంటాక్టులో ఉన్న వారెవరూ మనం చేసే ఫైళ్ల బదిలీని పసిగట్టలేరు. దీన్ని మనం టెస్ట్ చేసి చూడాలని భావిస్తే.. డెస్క్‌టాప్‌ వర్షన్‌లో WhatsApp వెబ్ బీటా వెర్షన్ 2.2353.59ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో టెస్టు చేసి చూడొచ్చు.

Also Read: Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి

సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాల్లో అనేక కేసులు ‘వాట్సాప్‌’తో ముడిపడి ఉన్నాయని, హ్యాకర్లు, మోసగాళ్లు ‘వాట్సాప్‌’ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని కేంద్ర హోంశాఖ ఆధీనంలోని మేధోసంస్థ బీపీఆర్‌డీ హెచ్చరిక జారీచేసింది. వీటిని అడ్డుకునేందుకు కేంద్ర హోం శాఖకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. గుర్తు తెలియని, అనుమానాస్పద నంబర్లతో వచ్చే వాట్సాప్‌ కాల్స్‌ను స్వీకరించరాదని యూజర్లకు సూచించింది. ‘జాబ్‌ ఆఫర్లు ఉన్నాయంటూ, పెట్టుబడి పథకాలు చెబుతామంటూ హ్యాకర్లు ఆయా వ్యక్తులకు వాట్సాప్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ ద్వారా గాలం వేస్తున్నారు. ఆయా వ్యక్తుల సున్నితమైన సమాచారం సేకరించాక వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. వియత్న్నాం, కెన్యా, ఇథియోపియా, మలేషియా నుంచి హ్యాకర్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు’ అని బీపీఆర్‌డీ నివేదిక పేర్కొన్నది. వాట్సాప్‌లోని ‘స్క్రీన్‌ షేర్‌’ ఆప్షన్‌తో సైబర్‌ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.