Air Taxi: రోడ్డు ట్యాక్సీల మాదిరే… ఎయిర్‌ ట్యాక్సీలు… రయ్యు రయ్యు గాల్లోకి!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అన్నీ రంగాల్లో కన్నా…

  • Written By:
  • Updated On - February 14, 2023 / 10:00 PM IST

Air Taxi: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అన్నీ రంగాల్లో కన్నా… సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరీ ఎక్కువగా దూసుకెళ్తుంది. ఒక దేశానికి మరో దేశానికి మధ్య టెక్నాలజీలో విపరీతమైన పోటీతత్వం ఏర్పడింది. మారుతున్న కాలానికి సైతం అలాంటి వినూత్న సాంకేతిక అందించాల్సిన పరిస్థితులు దాపరించాయి. దశాబ్దం క్రితం టూజీ, త్రీడీ నెట్‌వర్కింగ్‌ వాడిన మనం.. ఇప్పుడు పైవ్‌జీ వాడేస్తున్నాం. ఇదే క్రమంలో డ్రోన్ల హావా కూడా కొనసాగుతోంది.

ప్రస్తుతం మనం ఎక్కడైనా వెళ్లాలంటే టక్కున గుర్తుకొచ్చేది ట్యాక్సీ. పాతకాలంలో అయితే రిక్షాలు, గుర్రాలు ఉండేవి. ఇప్పుడు కాలం మారింది కదా. ఆటోలు, ఉబర్‌ క్యాబ్‌లు, బైక్‌ ట్యాక్సీలు వచ్చాయి. వీటితోపాటు డబ్బున్న వారికైతే… ప్రైవేటు జెట్‌ విమానాలను అద్దెకు తీసుకొని అలా విహరిస్తున్నాయి. అయితే ఇవి కొందరికే అందుబాటులో ఉన్నా… రానురాను.. మరింత మందికి చేరువ అవుతాయనే భావన కలుగుతోంది.
చిన్న విమానాలను భవిష్యత్తులో ట్యాక్సీలుగా నడపనున్నారు. వీటినే ఎయిర్ ట్యాక్సీల కాన్సెప్ట్‌గా నామకరణం చేశారు. ఇది… ఎప్పటి నుంచో ఆలోచనల్లో ఉన్నదే.

2026 నాటికి దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలు తీసుకురానున్నారు.ఈ మేరకు దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఫ్లైయింగ్ ట్యాక్సీల డిజైన్లకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.., ఎయిర్ ట్యాక్సీలు దిగేందుకు అనువైన వెర్టిపోర్టుల నిర్మాణం మరో మూడేళ్లలో సాకారం కానుందని వెల్లడించారు.

ఎయిర్ ట్యాక్సీలతో రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా.., ప్రయాణ వ్యవధి కూడా తగ్గిపోతోంది. చిన్న తరహా విమానాల్లో చార్జీలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందనక్కర్లేదు. ఊబర్ రైడ్ తో పోల్చితే కూడా చవకగానే ఉంటాయని….. దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ అహ్మద్ బెహ్రోజియన్ వెల్లడించారు. ఎయిర్ ట్యాక్సీల రేట్లు అన్ని వర్గాలకు అందుబాటులోనే ఉంటాయని… స్పష్టం చేశారు. ఎయిర్ ట్యాక్సీల ఉత్పాదన పెరిగే కొద్దీ, టెక్నాలజీ వ్యయం కూడా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు.

దుబాయ్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలను 240 కి.మీ పరిధిలో నడపనున్నారు. వీటి గరిష్ఠ వేగం గంటకు 300 కి.మీ. వీటిని యూఏఈలోని ఇతర నగరాల మధ్య కూడా తిప్పుతామని బెహ్రోజియన్ తెలిపారు. దాంతో దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వ్యవధి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు.