Site icon HashtagU Telugu

Smartphone Pinky : ‘స్మార్ట్‌ఫోన్ పింకీ’ వస్తోంది.. బీ కేర్ ఫుల్ !!

Smartphone Pinky

Smartphone Pinky

Smartphone Pinky : స్మార్ట్​ఫోన్‌ను మనలో చాలామంది అతిగా వాడేస్తున్నారు. రోజులో ఎక్కువ సేపు ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. అలాంటి వాళ్లు బీ కేర్ ఫుల్ !! ఎందుకంటే ‘స్మార్ట్​ఫోన్​ పింకీ’ వస్తోంది !! స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలామందికి ‘స్మార్ట్​ఫోన్​ పింకీ’ అనే ప్రాబ్లమ్ వస్తోంది. ప్రత్యేకించి ఐఫోన్ వాడే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని యాపిల్ కంపెనీ ఖండిస్తోంది. అదంతా దుష్ప్రచారం అని స్పష్టం చేస్తోంది.  పింకీ ఫింగర్ అంటే.. చిటికెన వేలు. స్మార్ట్ ఫోన్ వాడకంతో మన చిటికెన వేలు నిర్మాణ స్వరూపం దెబ్బతింటోంది. దాని షేప్ మారిపోతోంది. ఈ సమస్యనే ‘స్మార్ట్​ఫోన్​ పింకీ’  అని పిలుస్తున్నారు.  దీనిపై మరిన్ని వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

మన స్మార్ట్ ఫోన్​కి సపోర్ట్​గా చిటికెన వేలు అడ్డుపెట్టి.. ఎక్కువకాలం వినియోగించినప్పుడు వేలు వంగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. ఫోన్​ను ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉంచడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఫోన్ బరువు వేలుపై ఒత్తిడి కలిగించి శాశ్వతంగా వంగిపోయేలా చేస్తుంది. ఫోన్​ సంబంధిత వైద్య పరిస్థితులపై వైద్య నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎక్కువ టైం ఫోన్​లలో టెక్స్ట్​ చేయడం, ఫోన్​ని ఎక్కువ సేపు పట్టుకుని ఉపయోగించక పోవడమే మంచిదని సూచిస్తున్నారు. టెక్స్ట్ చేయడం కోసం ఎక్కువ సమయం మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచి ఉంచే వ్యక్తులలో  తలెత్తే ‘స్మార్ట్​ఫోన్ ఎల్బో’ అనే సిండ్రోమ్​ వల్ల కూడా చిటికెన వేలుపై భారం పడుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.  చిటికెన వేలులో(Smartphone Pinky) జలదరింపు, తిమ్మిరి వంటివి ఫీల్ అయితే అనుమానించాలని.. అది క్రమంగా నరాలు దెబ్బతినడానికి దారితీసే రిస్క్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫింగర్స్​లో డిఫరెన్స్ ఏర్పడుతుంటుందని చెప్తున్నారు.

Also Read : Tihar Jail : తీహార్ జైలులో కల్వకుంట్ల కవిత.. ఈ జైలు విశేషాలివీ

బొటనవేలు, మెడ విషయంలోనూ బీ అలర్ట్

స్మార్ట్‌ఫోన్‌ను వాడే క్రమంలో టెక్స్​టింగ్ థంబ్​, మెడ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  బొటనవేలు కీళ్లను రోజంతా టెక్స్ట్​ చేస్తూ.. స్వైప్​ చేయడానికి ఉపయోగిస్తే.. కీళ్ల సమస్యలు పెరిగిపోతాయని అంటున్నారు.  మెడ విషయానికొస్తే.. సాధారణంగా ప్రతి ఒక్కరి తల బరువు సగటున 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. స్మార్ట్​ ఫోన్​ను చూసేప్పుడు తలను వేలాడదీసుకుని కిందికి చూస్తుంటాం. దీనివల్ల మెడకండరాలపై భారం పెరుగుతుంది. దీనివల్ల అదనపు ఒత్తిడి, కండరాల నొప్పులు పెరుగుతాయి. దీనివల్ల మెడ వెనుక భాగంలో వాపు వచ్చే రిస్క్ ఉంటుంది. స్మార్ట్​ఫోన్ వాడకం ట్రిగ్గర్ ఫింగర్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్​ను మరింత తీవ్రతరం చేస్తుంది.

Also Read :Kamal Hassan : ఒక్క సాంగ్ కోసం కమల్ అంత వర్క్ చేశారా..?