Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..

మీరు గూగుల్‌ క్రోమ్‌ వాడుతుంటారా ? అందులో న్యూస్ ఆర్టికల్స్, ఇతరత్రా సమాచారం చదువుతుంటారా ?

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 08:05 AM IST

Listen To This Page : మీరు గూగుల్‌ క్రోమ్‌ వాడుతుంటారా ? అందులో న్యూస్ ఆర్టికల్స్, ఇతరత్రా సమాచారం చదువుతుంటారా ? అయితే మీకు మరింత కంఫర్ట్ ఇచ్చే సరికొత్త ఫీచర్ వచ్చేసింది. దాని పేరే ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’. తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వాడుకొని మనం వెబ్‌ పేజీలోని టెక్ట్స్‌ను ఆడియోలాగా చదివేయొచ్చు. అంటే ఇకపై మనం టెక్ట్స్‌ను కష్టపడి చదవకుండా.. ఈజీగా వినేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ అద్భుత ఫీచర్ కొందరికే అందుబాటులోకి వచ్చింది. విడతలవారీగా గూగుల్ క్రోమ్ వాడే ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

  • ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’(Listen To This Page) ఫీచర్‌‌ను వాడాలంటే వెబ్‌ పేజీని ఓపెన్‌ చేసి, పైన కుడివైపు ఉండే త్రీడాట్స్‌ మెనూ ఓపెన్‌ చేయాలి. అక్కడ కనిపించే ‘లిజన్‌ టు దిస్​ పేజ్​’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • పాడ్‌కాస్ట్‌లాగా వాయిస్‌ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్‌ ప్లేయర్‌ తరహాలో దీన్ని మీరు పాజ్‌, రివైండ్‌, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసుకోవచ్చు.
  • వేగంగా వినాలనుకుంటే, ప్లే బ్యాక్‌ స్పీడ్‌ను కూడా మార్చుకోవచ్చు.
  • ఈ ఫీచర్‌లో రూబీ, రివర్‌, ఫీల్డ్‌, మోస్‌ అనే నాలుగు రకాల వాయిస్‌ టైప్స్‌ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని హాయిగా ఆడియో ఫార్మాట్‌లో వినొచ్చు.

Also Read :YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?

  • ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’ అనే ఈ ఫీచర్ ప్రస్తుతం  12 భాషలకు సపోర్ట్‌ చేస్తోంది.
  • ఈ లిస్టులో మన దేశానికి చెందిన హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇండోనేసియన్‌, జపనీస్, పోర్చ్‌గీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషలు ఉన్నాయి.
  • అంటే ఈ భాషల్లోని టెక్ట్సులకు ఆడియోను మనం వినేయొచ్చు.
  • మన ఆండ్రాయడ్ డివైజ్‌కు స్క్రీన్ లాక్ చేసి ఉన్నా.. ఈ ఫీచర్ ద్వారా టెక్ట్సు యొక్క ఆడియోను మనం వినొచ్చు.
  • ఒక వెబ్​ పేజీలో ఆడియోను వింటూనే.. మరో వెబ్ పేజీని మనం యాక్సెస్ చేయొచ్చు.
  • పెద్ద పెద్ద వ్యాసాలు చదివే వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది.
  • ప్రస్తుతానికి ఈ ఫీచర్​ అన్ని వెబ్‌ పేజీలకు సపోర్ట్ చేయడం లేదు.

Also Read :Kavach Safety System: రైల్వేలో కవాచ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?