Site icon HashtagU Telugu

AI Vs Humans : మనుషుల్లా మాట్లాడుకునే ‘ఏఐ మోడల్స్’ రెడీ.. ఎలా ?

Ai Vs Humans

Ai Vs Humans

AI Vs Humans : రోబో సినిమాలో చిట్టీ రోబోను చూశారు కదా !! సినిమాలో అది ఏమేం చేసిందో గుర్తుంది కదూ!! తన లాంటి మరెన్నో రోబోలను చిట్టీ రోబో తయారు చేసుకోవడాన్ని ఆ మూవీలో అద్భుతంగా చూపిస్తారు. అటువంటి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీనే ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీ న్యూరోసెంటర్ శాస్త్రవేత్తలు తయారు చేశారు.  రోబోల మధ్య కమ్యూనికేషన్, నాలెడ్జ్‌ షేరింగ్‌కు దోహదపడే సాంకేతికతతో ముడిపడిన ప్రయోగాన్ని ఈ సైంటిస్టులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) టెక్నాలజీని ఉపయోగించి ఒక ఏఐ మోడల్‌ను మరో ఏఐ మోడల్‌తో కనెక్ట్ చేసి పరీక్షించారు. మనుషులలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండే రెండు ఏఐ మోడళ్లు ఒకదాని నుంచి మరొకటి నాలెడ్జ్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకొని.. అతి పెద్ద టాస్కులను పూర్తి చేశాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మోడల్స్ ఎక్కువ శిక్షణ డేటా అవసరం లేకుండానే.. ఒకదానికొకటి డేటాను బదిలీ చేసుకొని,  వాటికి కేటాయించిన పనులను పూర్తి చేశాయన్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక మార్చి 18న ‘నేచర్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.

We’re now on WhatsApp. Click to Join

జెనీవా యూనివర్సిటీ న్యూరోసెంటర్ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఏఐ మోడల్స్ రాతపూర్వక సూచనల ఆధారంగా పనులను నేర్చుకొని వాటిని నిర్వహిస్తాయి. ఈమేరకు సామర్థ్యాలను కలిగిన ఏఐ మోడల్స్‌తో ఒక నెట్‌వర్క్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ నెట్ వర్క్‌లోని ఏఐ మోడల్స్ నేర్చుకున్న పనులను ఇంకో ఏఐ మోడల్స్ నెట్‌వర్క్‌కు(AI Vs Humans) వివరించి.. అవే పనులను వాటితోనూ చేయించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు మనిషి ఇచ్చిన కమాండ్స్‌ తో ఏఐ అద్భుతాలు చేసింది. ఇకపై ఏఐ మోడల్స్  వాటిలో అవే పరస్పరం మాట్లాడుకొని నాలెడ్జ్ షేర్‌ చేసునే దశకు చేరుకుంటాయి.

Also Read : Group 1 Alert : గ్రూప్‌-1 మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోండి

నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) అనేది AIకి సబ్‌ఫీల్డ్. ఇది కంప్యూటర్‌లలో మానవ భాషను రీ-క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని ద్వారా మెషిన్స్ సహజంగా రాసిన టెక్స్ట్ ను లేదా స్పీచ్ ను అర్థం చేసుకోగలవు. మళ్లీ క్రియేట్ చేయగలవు. జెనీవా యూనివర్సిటీ న్యూరోసెంటర్ శాస్త్రవేత్తలు వీటిని న్యూరల్ నెట్‌వర్క్‌ల ఆధారంగా నిర్మించారు. ఇవి మెదడులోని న్యూరాన్‌ల అమరికను ప్రతిబింబించేలా రూపొందించిన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ల కలెక్షన్లు. ఒక ఏఐ నెట్‌వర్క్‌ పనులు నేర్చుకున్న తర్వాత, వాటిని రెండో నెట్‌వర్క్‌కి వివరించగలిగింది. మొదటి దాన్ని కాపీ చేసి, తద్వారా ఆ పనులను రిక్రియేట్ చేయగల సామర్థ్యంతో రెండో ఏఐ పని చేస్తుంది.ఈ AI ఏజెంట్ మానవుడిలానే లాజికల్ గా ఆలోచించగలదు. అనేక రంగాలలో పనులను చేయగలదు. రోబోలు మనుషుల్లా ఆలోచించటం మొదలు పెడితే అది విపరీతాలకు కూడా దారితీయవచ్చు. మనుషుల ఉద్యోగాలకు వచ్చే ముప్పు గురించి కొత్తగా చెప్పే పని లేదు.

Also Read :Ineligible Candidates : పోటీకి అనర్హుల జాబితా ప్రకటించిన ఈసీ.. ఎవరంటే ?

Exit mobile version