Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తకి విరుద్ధం అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతామని లంకేయులు హెచ్చరించిన విషయం తెలిసిందే

Shakib Al Hasan: శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తకి విరుద్ధం అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతామని లంకేయులు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా షకీబ్ పై దాడి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. షకీబ్ ను కొందరు వ్యక్తులు కాలర్ పట్టుకుని లాగడంతో షకీబ్ కిందపడిపోయాడు. అయితే ఆ వీడియో ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేదు.

గత మార్చిలో షకీబ్ ను దుబాయ్ లోని ఆరవ్ జ్యూవెలర్స్ నిర్వహించిన ఈవెంట్ కు హాజరయ్యాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు షకీబ్ ను లాగే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారింది.ఇక వన్డేలు, టీ20లలో నంబర్ వన్ ఆల్‌రౌండర్ గా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ప్రపంచకప్ లో చెలరేగిన వివాదం తరువాత ప్రత్యర్థి జట్లకు విలన్ గా మారిపోయాడు. బంగ్లాదేశ్ తరుపున ఎక్కువ ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉన్న షకీబ్ శ్రీలంకతో మ్యాచ్‌లో మ్యాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్ అప్పీలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇన్నేళ్ల క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఆటలోనే కాదు వివాదాల్లోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నాడు.

Also Read: Kadiyam Srihari: లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టం : కడియం