Kohli’s Average Drops: కోహ్లీ యావరేజ్ డౌన్!

గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ , రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌ బాల్‌ టెస్టులోను తెలిపోయాడు.

  • Written By:
  • Updated On - March 14, 2022 / 03:36 PM IST

గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ , రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌ బాల్‌ టెస్టులోను తెలిపోయాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లో కేవలం 23 పరుగుల మాత్రమే చేసి కోహ్లి పెవిలియన్‌కు చేరిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 16 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.. దాంతో ఐదేళ్ల తర్వాత తొలిసారి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ సగటు 50 కిందకి పడిపోయింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కనీసం 47 పరుగులు చేసి ఉంటే అతని సగటు 50కిపైనే ఉండేది. కానీ.. కోహ్లీ 36 పరుగులే చేయగలిగాడు. అంతకుముందు 5 ఏళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సగటు 50 నుంచి 49.55కి పడిపోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి తన కెరీర్ లో101 టెస్ట్‌ల్లో 49.55 సగటుతో ఉండగా.. 260 వన్డేల్లో 58.07 సగటు, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. ఇక పింక్ బాల్ టెస్టు విషయనికొస్తే.. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు పోరాడుతోంది. ఈ మ్యాచ్ లో 447 పరుగుల లక్ష్యాన్ని లంకేయుల ముందు టీమిండియా ఉంచగా.. ఆదివారం ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులతో నిలిచింది. శ్రీలంక జట్టు విజయానికి ఇంకా 419 పరుగులు చేయాల్సి ఉంది.