Supreme Court on Abortion: ‘అబార్షన్ల’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

చట్టాలు, హక్కుల ప్రకారం వివాహిత మహిళలు మాత్రమే అబార్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • Written By:
  • Updated On - September 29, 2022 / 03:59 PM IST

చట్టాలు, హక్కుల ప్రకారం వివాహిత మహిళలు మాత్రమే అబార్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అవివాహిత మహిళలకు అబార్షన్ చేయడం అనేది చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళలందరికీ అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లి కాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని పేర్కొంది.

అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలకు తేడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని, భార్యతో బలవంతపు శృంగారాన్ని సుప్రీంకోర్టు నేరంగా పరిగణించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సంచలనాత్మక తీర్పును కూడా కోర్టు గుర్తించింది, అయితే వైవాహిక అత్యాచారం పూర్తిగా అబార్షన్ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు సంచనల తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.