Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!

స్వేచ్చ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలా ఆడవారు ఎలాంటి అసాధ్యనైన్నా సుసాధ్యం చేసే సత్తా వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలం మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా టాలెంట్ ను బయటపెడుతున్నారు మహిళామణులు.

  • Written By:
  • Updated On - February 22, 2022 / 11:47 AM IST

స్వేచ్చ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలా ఆడవారు ఎలాంటి అసాధ్యనైన్నా సుసాధ్యం చేసే సత్తా వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలం మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా టాలెంట్ ను బయటపెడుతున్నారు మహిళామణులు. గొప్ప గొప్ప స్థానాల్లో రాణిస్తున్నారు. ఎన్నో రంగాల్లో కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. కేవల కెరీర్ లోనే కాదు చెడు అలవాట్లలోనూ ముందుంటున్నారు. అవును మీరు చదివింది నిజం….

మగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం…మగువల తగ్గేదే లే అంటున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే వారిని ఆ విషయాల్లో మించిపోరారనే చెప్పొచ్చు. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం…గత ఐదుసంవత్సరాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మందు కొట్టారట. ఒడిశాకు సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెళ్లడించిన…ఈ రిపోర్ట్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో 2015-16 లో 15 ఏండ్లకు పైబడిన వారు ఆల్కహాల్ సేవించే వారు కేవలం 2.4 శాతంగా ఉండేది. కానీ 2020-21 నివేధికల ప్రకారం.. ఈ సంఖ్య దాదాపు 4.3 శాతంగా మారింది. అదే 2015-16 లో ఆల్కహాల్ ను తాగే పురుషులు 39.0 శాతం కాగా…. 2020-21 కి ఈ సంఖ్య 28.8 శాతానికి తగ్గిందట.

కేవలం పట్టణాల్లోనే ఆల్కహాల్ ను తాగుతారనుకోకండి. ఎందుకంటే.. ఒడిషాలో పట్టణ ప్రజలకంటే గ్రామీణ ప్రజలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని తేలింది. అదికూడా 15ఏండ్ల పైనబడిన వారే ఎక్కువ అట. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు 30.2 శాతంగా ఆల్కహాల్ తీసుకుంటే… అదే పట్టణాల్లో 22.7 శాతంగా మద్యం సేవిస్తున్నారట. ఇకపోతే పట్టణాల్లో స్త్రీలు 1.4 శాతంగా తాగితే…. గ్రామాల్లో 4.9 శాతం మద్యం తీసుకుంటున్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా… గ్రామీణ ప్రాంతాల్లోని ఆడవారు ఆల్కహాల్ ను వినియోగించే శాతం 2.4 నుంచి 4.9 శాతానికి పెరిగిందట. అదే పురుషులు ఇందుకు భిన్నంగా ఉన్నారట. వీరు
41.3 శాతం నుంచి 20.2 శాతానికి చేరుకుంది. ఆడవారు ఆల్కహాల్ వినియోగాన్ని పెంచితే మగవారు తగ్గించారు. కాగా పట్టణ ప్రాంతాల్లో ఐదేండ్ల కాలం నుంచి ఆడవారి ఆల్కహాల్ వినియోగంలో పెద్ద మార్పులు ఏమీ రాలేదట. కానీ వీరి సంఖ్య 1.3 నుంచి 1.4 శాతానికి చేరుకుందని అధ్యయనాల్లో తేలింది.

ఇక స్మోకింగ్ విషయంలో మగజాతిని వెనక్కినేట్టేసారని సర్వేలో తేలింది. స్మోకింగ్ చేసే మహిళలు 2015-16 లో 17.3 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా 26 శాతానికి పెరిగిందని సర్వేపేర్కొంది.