Monkeypox : యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు..?

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు నమోదైంది.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 11:06 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు నమోదైంది. అనుమానిత రోగి నమూనాలను పరీక్షల కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపారు. అనుమానిత రోగి బిధునా తహసీల్‌లో నివసిస్తున్నారు. గత వారం రోజులుగా జ్వరం, మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు.సాధ్యమైన మంకీపాక్స్‌ లక్షణాల దృష్ట్యా, ఈ నమూనాలను ప‌రీక్ష‌ల కోసం లక్నోలోని KGMUకి పంపామని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ వర్మ తెలిపారు. మహిళ శరీరంపై చిన్న మచ్చలను వైద్యులు గమనించారు. ఆ మహిళ తన చేతులు, అరికాళ్ళలో తీవ్రమైన నొప్పిని ఉంద‌ని వైద్యుల‌కు తెలిపింది. మంకీపాక్స్‌గా అనుమానించిన వైద్యాధికారి .. మహిళను బిహ్దునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రెఫర్ చేశారు.