Site icon HashtagU Telugu

Aditya-L1 Takes Selfie: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య-ఎల్ 1.. విజువల్స్ షేర్ చేసిన ఇస్రో..!

Aditya-L1 Takes Selfie

Compressjpeg.online 1280x720 Image 11zon

Aditya-L1 Takes Selfie: ఇస్రో చేపట్టిన ఆదిత్య-ఎల్ 1 సూర్యుడి దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 282 కి.మీ – 40,225 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య అక్కడి నుంచి భూమి, చంద్రుడి ఫొటోలతోపాటు తన సెల్పీ (Aditya-L1 Takes Selfie)ని తీసుకుంది. ఈ విజువల్స్ ని ఇస్రో ట్వీట్ చేసింది. తనకు ఇస్రో నిర్దేశించిన L1 పాయింట్ వైపుగా ప్రయాణం సాగిస్తూ ఆదిత్య మిషన్ సెప్టెంబర్ 4, 2023న సెల్ఫీ తీసుకుంది. అలాగే భూమి, చందమామను కూడా ఫొటోలు తీసింది. తాజాగా ఈ విషయాన్ని ఇస్రో తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో రూపంలో షేర్ చేసింది. సెల్ఫీ ఫొటోలో.. VELC, SUIT అనే ఇన్‌స్ట్రుమెంట్లను మనం చూడవచ్చు అని ఇస్రో తెలిపింది. అలాగే ఆదిత్యకు ఉన్న ఆన్ బోర్డ్ కెమెరా.. భూమి, చందమామను ఫొటోలు తీసింది. ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహం 125 రోజుల ప్రయాణం అనంతరం లాగ్రాంజ్ 1 కక్ష్యలోకి చేరి సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపనుంది.

వీడియోను ఇక్కడ చూడవచ్చు..

Also Read: India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..

ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 18 వరకు భూమి చుట్టూ నాలుగుసార్లు తన కక్ష్యను మారుస్తుంది. తదుపరి కక్ష్య సెప్టెంబర్ 10 రాత్రి ఉంటుంది. ఆదిత్య L1కి చేరుకున్న తర్వాత అప్పుడు ప్రతిరోజూ చిత్రాలను పంపుతుంది. తద్వారా సూర్యుడిని పెద్ద ఎత్తున అధ్యయనం చేయవచ్చు. ఈ చిత్రాలు ఆదిత్యలో ఇన్‌స్టాల్ చేయబడిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC) ద్వారా తీయబడతాయి. ఆదిత్య L1 ద్వారా ఇస్రో ప్రధానంగా సూర్యుడి జ్వాలలు, సౌర గాలులు, ప్లాస్మా తీరు, కరోనా (ఉపరితలం) లక్షణాలు, రేడియేషన్ ప్రభావం, కాంతి మండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్) వంటి అంశాలను పరిశోధించనుంది.

L1 వరకు ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఆదిత్య అన్ని పేలోడ్‌లు స్విచ్ ఆన్ చేయబడతాయి. అంటే అందులో అమర్చిన పరికరాలన్నీ యాక్టివ్‌గా మారుతాయి. అప్పుడు సూర్యుడి అధ్యయనాన్ని మిషన్ ప్రారంభిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు వాటి పనితీరుని తనిఖీ చేయడానికి వాటిని సక్రియం చేసి అవి సక్రమంగా పని చేస్తున్నాయో లేదో చూస్తారు. ఫిబ్రవరి చివరి నుంచి రెగ్యులర్‌గా డేటాను ఈ మిషన్ అందించనుంది.