Chandrayaan 3 : చంద్రుడి వద్దకు వెళ్ళడానికి అమెరికాకు 4 రోజులు, రష్యాకు 2 రోజులే.. కానీ చంద్రయాన్‌కి 40 రోజులు ఎందుకు?

గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ సమయమో తెలుసా?

  • Written By:
  • Updated On - August 22, 2023 / 03:38 PM IST

జాబిల్లి(Moon)పై అన్వేషణ కోసం ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan 3)ని నేడు లాంచ్ చేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ప్రారంభించింది. చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు సమయం పడుతుంది. కానీ గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ సమయమో తెలుసా?

భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం దాదాపు 3.48 లక్షల కిలోమీటర్లు. ఈ దూరాన్ని స్ట్రైట్ గా వెళ్తే తొందరగా కవర్ చేయొచ్చు. కానీ రాకెట్ అంత స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే శక్తివంతంగా, పెద్దదిగా ఉండాలి, ఇంధనం కూడా భారీగా అవసరం అవుతుంది. దీనికి చాలా ఖర్చు అవుతుంది. 1969లో అమెరికా చంద్రుడిపైకి అపోలో 11 పంపించడానికి భారీ రాకెట్ ని వాడింది. అది గంటకు 39 వేల కిలోమీటర్లతో దూసుకుపోయింది. ఆ రాకెట్ ఎత్తు ఆల్మోస్ట్ 363 అడుగులు కానీ మన చంద్రయాన్ 3 కి వాడిన రాకెట్ ఎత్తు కేవలం 142 అడుగులు. అమెరికా అప్పట్లోనే దాదాపు 1200 కోట్లు ఖర్చు పెట్టింది ఒక ప్రయోగానికి. కానీ చంద్రయాన్ 3కి ఇప్పుడు కేవలం 600 కోట్ల పైనే అయింది.

అలాగే రష్యా కూడా లూనా 2 ప్రాజెక్టు ని పెద్ద రాకెట్ తో, ఎక్కువ ఖర్చుతో కేవలం రోజున్నరలోనే చంద్రుడి వద్దకు చేరుకునేలా చేశారు. వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, ప్రాజెక్టు వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో తక్కువ ఖర్చుతో అయ్యే పనిని ఎంచుకుంది. చంద్రయాన్ స్ట్రైట్ గా చంద్రుడి మీదకు వెళ్ళదు. ముందు చంద్రయాన్ భూమి చుట్టూ ఉండే దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మెల్లి మెల్లిగా తిరుగుతూ చంద్రుడి వైపు వెళ్తుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది. చాలా తక్కువ ఇంధనంతో, తక్కువ ఖర్చుతో ఇస్రో ఈ ప్రాజెక్టు చేసింది. అందుకే చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు పడుతుంది.

 

Also Read : Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అంటే ఏమిటి..? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటో తెలుసా..?