Site icon HashtagU Telugu

NOTA : ‘నోటా’కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా ? దీని చరిత్ర ఇదిగో

Nota

Nota

NOTA : ‘నోటా’.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని ప్రత్యేకమైన ఆప్షన్. ఎన్నికల్లో పోటీచేసే ఏ అభ్యర్థి కూడా నచ్చకుంటే మనం నోటాను నొక్కొచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 49(ఓ) కింద ఈ హక్కును ఓటర్లు వాడుకోవచ్చు. నోటా అంటే ‘‘నన్ ఆఫ్ ది ఎబో’’ (ఎవరూ కాదు) అని అర్థం. కొన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. అందులో నచ్చని వారుంటే తిరస్కరించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది.

We’re now on WhatsApp. Click to Join

‘నోటా’ రాకముందు కూడా.. 

ప్రజాప్రాతినిధ్య చట్టం – 1961లోని సెక్షన్‌ 49(ఓ) ప్రకారం నోటా పద్ధతి కొన్ని దశాబ్దాల క్రితమే మన దేశంలో అమల్లోకి వచ్చింది. అయితే ఆ పద్ధతి కాస్త విభిన్నంగా ఉండేది.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను తిరస్కరించే ఓటరు నేరుగా పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ అధికారిని కలవాల్సి వచ్చేది. 17-ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థులను తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం చేసి, బ్యాలెట్‌ పెట్టెలో వేయాల్సి వచ్చేది. రహస్య బ్యాలెట్‌ విధానానికి ఇది విరుద్ధమని అప్పట్లో భావించేవారు. దీనివల్ల ఓటరు భద్రతకు కూడా విఘాతం కలిగేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడం వల్ల నోటా మీటను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.

Also Read :Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి

Also Read : TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే!