Site icon HashtagU Telugu

Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

Umesh Chandra

Umesh Chandra

సివిల్ స‌ర్వెంట్లు (ఐఏఎస్, ఐపీఎస్) స‌మాజానికి (Umesh Chandra) నాలుగో సింహంలాంటి వాళ్లు. కానీ, స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో(Police Fight) చాలా మంది పిల్లులుగా మారిపోయారు. `అయ్యా..ఎస్` అంటూ ఐదేళ్ల త‌రువాత ప‌ద‌విలో ఉంటారో, ఉండ‌రో తెలియ‌ని ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ద్ద జీ హుజూర్ అంటోన్న వాళ్లు ఎక్కువే. అలాంటి వాళ్లకు ధైర్యాన్ని, అంకిత‌భావాన్ని, చిత్త‌శుద్దిని, సామాజిక‌సేవ‌ను గుర్తు చేసే నిలువెత్తు నిద‌ర్శ‌నం ఉమేష్ చంద్ర. స‌రిగ్గా 20ఏళ్ల క్రితం న‌క్స‌లైట్ల తుపాకుల‌కు బ‌లయిన నికార్సైన సివిల్ స‌ర్వెంట్ ఆయ‌న‌. కేవ‌లం 33 ఏళ్ల వ‌య‌సులోనే సామాజిక సేవా పోరాటంలో వీర‌మ‌ర‌ణం పొందిని ఐపీఎస్ అధికారి.

న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం మీద ఉక్కుపాదం(Umesh Chandra)

న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం మీద ఉక్కుపాదం మోపిన సిస‌లైన ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర‌(Umesh Chandra). మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని అరెస్ట్ చేసిన మొట్ట‌మొద‌టి పోలీస్ ఆఫీసర్. క‌డ‌ప జిల్లాలో తక్కువ కాలమే పనిచేసినా (Police Fight)ప్రజల ఆదరాభి మానాలను పొందారు. కడప పులి అనిపించు కున్నారు. 1995 ఫిబ్రవరి లో వరంగల్ బదిలీ అయ్యారు. ప్రత్యేక విధుల అధికారిగా నియమింపబడి నక్సలైట్ల కార్య కలాపాలను అదుపులో పెట్టగలిగారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఆ రోజుల్లోనే ప్రవేశ పెట్టిన ఐపీఎస్ ఉమేష్ చంద్ర‌. 1995 లో ఉన్నతోద్యోగిగా పదోన్నతి పొంది సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ గా మరలా కడప జిల్లాకు బ‌దిలీ అయ్యారు. ఆ తరువాత 1997 లో కరీంనగర్ కు బదిలీ కాగా క‌డ‌ప ప్రజలు బదిలీ చేయవద్దని ధర్నాలు చేశారంటే ఆ రోజుల్లో ఉమేష్ చంద్ర చేసిన గొప్ప సేవ‌లు ఎన‌లేనివి. ఆయ‌న క‌డ‌ప జిల్లా ఎస్పీగా ఉన్న రెండేళ్లు ఫాక్షనిస్ట్ ల చెర నుంచి బైటపడి స్వేచ్చా వాయువులను సామాన్యులు పీల్చుకున్నారు. బ‌దిలీ సంద‌ర్భంగా ఇవే మాట‌లు చెబుతూ వాళ్ల గోడును ధర్నాల రూపేణా వెలిబుచ్చారు .

రాజారెడ్డిని అరెస్ట్ చేసిన మొట్ట‌మొద‌టి పోలీస్ ఆఫీసర్

ప్రభుత్వ అధికారిగా కొన్ని పరిధులు ఉంటాయని , బదిలీ చేసినప్పుడు వెళ్ళక తప్పదని ఉమేష్ చంద్ర(Umesh Chandra) ఆ రోజు క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌చెప్పార‌ట‌. కరీంనగర్ లో జూన్ 1997 నుండి 1998 ఏప్రిల్ వరకు ఎస్.పి గా పనిచేసారు . అప్ప‌ట్లో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. ఎంతో మంది నక్సలైట్లను అరెస్ట్ చేసి , మరి కొందరిని ప్రజా స్రవంతిలో క‌లిపారు. 1998 నవంబర్ లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా పదోన్నతి పొందారు. నక్సలైట్ల పై ఉక్కు పాదం మోపడంతో(Police Fight) అనేకులు వ్యతిరేకులుగా మారి చివరకు ఆయన్ను బలి తీసుకున్నారు.

Also Read : Delhi Police : పోలీసుల క‌ళ్లుగ‌ప్పి బైక్‌ల‌ను దొంగిలిస్తున్న కేటుగాడు.. ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న పోలీసులు

హైద్రాబాద్ లోని సంజీవరెడ్డి నగర్ కూడలి దాటుతుండగా 1999 సెప్టెంబ‌ర్ 4న కారులో నలుగురు నక్సలైట్లు తుపాకు లతో దాడిచేసి  ఉమేష్ చంద్ర ను (Umesh Chandra) హత్య చేసారు. అంగరక్షకుడు , డ్రైవర్ అక్కడే మరణించారు. తూటాల గాయాల కారు దిగి న‌క్స్ లైట్ల వెంట ఉమేష్ చంద్ర పరుగులు(Police Fight) తీసారు. వాళ్లు రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఉమేష్ ప‌డిపోయారు. ఆ త‌రువాత ఆయ‌న వద్దకు వచ్చి ప‌రిశీలించిన న‌క్స్ లైట్లు గన్ లేదని తెల్సుకుని దగ్గరగా మరలా కాల్పులు జరిపి పారిపోయారు. నక్సలైట్ల వ్యవస్థనే రూపు మాపాలనేది ఆయన ఆశయం. నక్సలైట్లు ప్రజా జీవితం లోకి రావాలని , ప్రజల్లో ఉండి పోరాటాలు చెయ్యాలని చెప్పేవారు. కానీ ఆ నక్సలైట్ల గుళ్ళకే బలైయ్యారు.

నిబ‌ద్ధత, నిజాయితీ, అంకితభావాలకు నిలువుటద్దం(Umesh Chandra)

ప్రాణాలొడ్డి ఉమేష్ చంద్ర (Umesh Chandra) చేసిన‌ త్యాగం ఇప్ప‌టికీ పోలీస్ శాఖలో శిక్షణా తరగతుల్లో పాఠ్యాంశంగా ఉంది. ఒకే వ్యక్తి రెండు సామాజిక సమస్యలు నక్షలిజం , ఫాక్షనిజాలను ఎదుర్కొన్న తీరు ఉమేష్ చంద్ర‌ను ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. నిబ‌ద్ధత, నిజాయితీ, అంకితభావాలకు నిలువుటద్దం ఆయ‌న‌. అలాంటి ఐపీఎస్  భౌతికంగా దూర‌మై ఆదివారం నాటికి 20 ఏళ్లు. ఇన్నేళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ ఆయన్ను అటు డిపార్ట్ మెంట్ లోనూ ఇటు ప్రజానీకం(Police Fight) త‌ల‌చుకుంటూనే ఉంటారు. కేవలం 33 ఏళ్ల వ‌య‌స్సుకే దివి కేగిన ఉమేష్ చంద్ర మీద పాటలు రాసి , పాడుతూ తమ అభిమానాన్ని చూపుతున్న వాళ్లు అనేకులు. నేటికీ వారిని ఎందరో తలుస్తూనే ఉంటారు. ఆయ‌న్ను ఆదర్శంగా తీసుకుని ఎన్నో సినిమాల్లో పోలీస్ పాత్రలు సృష్టింప బడ్డాయి. 2000 సెప్టెంబర్ 4 న ఉమేష్ చంద్ర శిలా విగ్రహాన్ని ఎస్. ఆర్. నగర్ కూడలిలో స్థాపించారు. ఎస్.ఆర్ నగర్ కూడలి రాగానే కొద్దిగ తలతిప్పితే ఠీవిగా నిలబడిన ఉమేష్ చంద్ర నిలువెత్తు విగ్రహం చిత్తిశుద్ధి, నిజాయితీ, ధైర్యం , సేవాత‌త్ప‌ర‌త‌, అంకిత‌భావం, పోరాడే త‌త్త్వంల‌ను క‌ల‌బోసిన ఐపీఎస్ ను గుర్తు చేస్తోంది.

సంఘ వ్యతిరేక శక్తులకు  సింహస్వప్నం

వేణుగోపాలరావు , నయనతార దంపతులకు 1966 వ మార్చి 19న గుంటూర్ జిల్లా , పెదపూడి గ్రామంలో ఉమేష్ చంద్ర(Umesh Chandra) జన్మించారు. తండ్రి హైద్రాబాద్ అల్విన్ సంస్థలో ఉద్యోగి అవ్వడం ఉమేష్ విద్య హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది. 1987 లో నిజాం కళాశాల నుండీ BA , 1989 లో ఉస్మానియా నుండి MA డిగ్రీలను పొందారు. రెండు డిగ్రీలకు బంగారు పథకాలు సాధించారు. 1991 జాతీయ పోలీస్ సేవలకు ఎంపికై ముస్సోరీ , హైద్రాబాద్ నేషనల్ అకాడమీల్లో శిక్షణ పొందారు. తొలి ఉద్యోగం 1992-94 మద్య వరంగల్ లో డిప్యూటీ సూపరిటెండెంట్ గా పనిచేసి నప్పుడు జన జాగృతి అనే సంస్థను స్థాపించి ప్రజలతో మమేకమ‌య్యారు . ఆ తరువాత 1994 లో పులివెందులకు బదిలీ అయిన త‌రువాత సంఘ వ్యతిరేక శక్తులకు (Police Fight)సింహస్వప్నంగా ప‌నిచేశారు. అలాంటి ఐపీఎస్ ప్ర‌స్తుత స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో క‌నిపించ‌డం బ‌హు అరుదు. సెల్యూట్ టూ ఉమేష్ చంద్ర ఐపీఎస్ !

Also Read : Telangana CS :మోడీ దెబ్బ‌కు`మాజీ సీఎస్`ఠా! 12 మంది IAS, IPSల‌పై ప్ర‌భావం!