Constitution Day 2023 : మన రాజ్యాంగం బర్త్ డే ఇవాళే

Constitution Day 2023 : నవంబరు 26.. ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 08:10 AM IST

Constitution Day 2023 : నవంబరు 26.. ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26 నాటి రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, స్వీకరించారు. అందుకే నవంబరు 26కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26 నాటికి 74 ఏళ్లు పూర్తవుతోంది.ఇక 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి జనవరి 26వ తేదీని ఏటా మనం భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి నవంబరు 26 అనేది మన దేశ రాజ్యాంగానికి పుట్టిన రోజు లాంటిది. దేశానికి ప్రజాస్వామ్యాన్ని.. తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను కల్పించిన భారత రాజ్యాంగానికి మనమంతా రుణపడి ఉండాలి.

We’re now on WhatsApp. Click to Join.

రాజ్యాంగ రచన విశేషాలు.. 

  • బ్రిటీష్ వాళ్లు రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మన దేశం విడిచి వెళ్లిపోతారని తెలిసిన తరువాత భారత రాజ్యాంగ రచన దిశగా ఏర్పాట్లు మొదలయ్యాయి.
  • రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభను ఏర్పాటుచేశారు. ఇందులో 15 మంది మహిళలు సహా 299 మందిని సభ్యులుగా నియమించారు.
  • బీఎన్‌ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు.
  • రాజ్యాంగ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్‌ 9న జరిగింది.
  • రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది.
  • రాజ్యాంగ సభలో మొత్తం 299 సభ్యులుండగా.. దాని తుది ప్రతిమీద 284 మంది సంతకం చేశారు.
  • భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ.. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారధిగా రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ ఏర్పాటైంది.
  • రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు.
  • 1947 నవంబర్‌ 26న అప్పటి రాజ్యాంగ పరిషత్ దీన్ని(Constitution Day 2023) ఆమోదించింది.

Also Read: Jwala Thoranam : ఇవాళ జ్వాలాతోరణం.. ఎలా నిర్వహిస్తారు ? ప్రాముఖ్యత ఏమిటి ?