Elections- 8 Apps : ఎన్నికల సమరానికి 8 యాప్‌లు.. 3 పోర్టల్స్ ఇవిగో

Elections- 6 Apps : ఇప్పుడు అసెంబ్లీ పోల్స్.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటర్లు, కాండిడేట్స్‌కు యూజ్‌ అయ్యేలా వివిధ మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది.

  • Written By:
  • Updated On - October 23, 2023 / 09:56 AM IST

Elections- 8 Apps : ఇప్పుడు అసెంబ్లీ పోల్స్.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటర్లు, కాండిడేట్స్‌కు యూజ్‌ అయ్యేలా వివిధ మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. పొలిటికల్‌ పార్టీలు, సభలు, సమావేశాలు ర్యాలీల నిర్వహణ కోసం అనుమతులు తీసుకునేందుకు మొదలుకొని ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల రూట్‌, ఇంటి నుంచే ఓటు కోసం నమోదు చేసుకోవడం  వరకు అన్ని విషయాల్లో గైడ్ చేసేందుకు పలు యాప్స్ ను రిలీజ్ చేసింది. ఎన్నికల సిబ్బంది, అధికారులకు ఉపయోగపడే యాప్స్ ను కూడా రెడీ చేశారు. ఓటర్లు, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది ఈ యాప్స్ ను ప్లే స్టోర్‌ లేదా యాప్స్‌.ఎంజీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి లాగిన్‌ అయ్యాక డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసీఐ.ఎన్‌ఐసీ.ఇన్‌తో పాటు ఎన్‌వీఎస్‌పీ.ఇన్‌ పోర్టల్‌ ద్వారా కూడా అనేక సేవలను(Elections- 8 Apps) పొందొచ్చు.

1.‘సీ విజిల్‌’ యాప్‌ 

గతంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలను ఫిర్యాదు చేయాలంటే అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఉల్లంఘనలకు అడ్డులేకుండా పోయే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వీటికి ‘సీ విజిల్‌’ యాప్‌తో ఎన్నికల సంఘం చెక్‌ పెట్టనుంది.  దీని ద్వారా అభ్యర్థులు/పార్టీల అక్రమాలు, నేర పూరిత చర్యలపై కంప్లైంట్ చేయొచ్చు. ఎన్నికల సంఘం 100 నిమిషాల్లో ఆ సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి చర్యలు తీసుకున్నదీ ఫిర్యాదు పంపిన వ్యక్తికి తెలియజేస్తుంది. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇందులో ఫొటో, వీడియో, ఆడియో అప్‌లోడ్ చేసి, వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

2.సక్షం- ఈసీఐ యాప్.. 

సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగుల కోసం సక్షం హెల్పింగ్‌ యాప్‌ను రూపొందించారు. పోలింగ్‌ కేంద్రానికి రాలేని వారు ఇందులో పేర్లు నమోదు చేసి.. అధికారుల ద్వారా రవాణా సదుపాయం పొందొచ్చు. వీల్ చైర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు వెతికి బూత్ సమాచారాన్ని పొందవచ్చు. దివ్యాంగులు ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గరే కూర్చొని ఓటు వేసే వెసులుబాటును కూడా పొందొచ్చు.

3.నో యువర్‌ క్యాండిడేట్‌ యాప్

‘నో యువర్‌ క్యాండిడేట్‌’ యాప్ ద్వారా అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థి నేర చరిత్ర, ఆస్తులు సహా సమాచారం అంతా అఫిడవిట్ లో ఉంటాయి.

4.ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌

ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌(వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక యాప్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ రిలీజ్ చేసింది. ఇందులో ఓటు నమోదుకు సంబంధించిన వివరాలు, ఓటర్ల జాబితాలోని పేర్ల సమాచారం, ఈ–ఎపిక్‌ కార్డును డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంటాయి.

5.వోటర్ టర్న్ ఔట్ యాప్

వోటర్ టర్న్ ఔట్ యాప్ ద్వారా సాధారణ ప్రజలు ఓటింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని చూసుకోవచ్చు. తద్వారా ఓటింగ్ సరళి ఎలా ఉందో తెలుస్తుంది.

6.సమాధాన్ యాప్

ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. మనం చేసే కంప్లయింట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇందులో ఆధారంగా పంపొచ్చు. అధికారులు తాము తీసుకునే చర్యల అప్ డేట్ ను కూడా పంపిస్తారు.

7.సువిధ యాప్

సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ యాప్‌ ద్వారా పర్మిషన్స్ కోరవచ్చు. వాహనాలు, లౌడ్‌ స్పీకర్లు, పార్టీ కార్యాలయాలు, హెలికాప్టర్ల వినియోగం, తదితర అంశాలకు సరైన పత్రాలిచ్చి ఆన్‌లైన్‌లో ఏకీకృత అనుమతులను తీసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే కంప్లయింట్స్ కు 24 గంటల్లోగా ఈసీ పరిష్కారం చూపుతుంది.

8.సుగమ్ యాప్

ఎన్నికల నిర్వహణలో వినియోగించే ప్రైవేటు వాహన వ్యవహారాల పర్యవేక్షణకు ఈ యాప్‌ ను వాడుతారు. వాహన యజమానాలు, డ్రైవర్లు, వారికి చెల్లింపుల వివరాలు ఇందులో డిస్ ప్లే అవుతుంటాయి.

9.నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌ పోర్టల్

ప్రజలు ఎన్నికల సంబంధిత కంప్లయింట్స్ చేసేందుకు నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌ (ఎన్‌జీఎస్‌) పోర్టల్‌ అందుబాటులో ఉంది. ఓటర్స్‌ లిస్టుకు సంబంధించిన కంప్లయింట్స్ కూడా ఇందులో ఇవ్వొచ్చు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర వివరాలను అందులో ఎంటర్ చేస్తే సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి చర్యలు చేపడతారు.

10.ఎలక్టోరల్‌ సెర్చ్ పోర్టల్

ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఎలక్టోరల్ సెర్చ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా తమ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాన్ని, మ్యాప్‌ను, రూట్‌ను తెలుసుకోవచ్చు.

11.‘ఈసీఐ.సిటిజన్‌ సర్వీసెస్‌.ఈసీఐ.ఇన్‌’ వెబ్ సైట్

ఎన్నికల వ్యవహారాలతో ముడిపడిన సమస్యల గురించి, వాటి తీవ్రతను బట్టి రిటర్నింగ్‌ అధికారి స్థాయి నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ వరకు ఎవరికైనా ‘ఈసీఐ.సిటిజన్‌ సర్వీసెస్‌.ఈసీఐ.ఇన్‌’ వెబ్ సైట్ ద్వారా కంప్లయింట్స్ ను పంపొచ్చు. ఈ ఫిర్యాదులపై జిల్లా రిటర్నింగ్‌ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు.

Also Read:Telangana: దసరా తర్వాత రెండో జాబితా విడుదల