April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీగా మార్చి 31ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం మరో వారంలో ముగియ వస్తోంది.

మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీగా మార్చి 31ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2022 – 23 ఆర్ధిక సంవత్సరం మరో వారంలో ముగియ వస్తోంది. ఏప్రిల్ (April) 1న 2024 ఆర్థిక సంవత్సరం షురూ అవుతుంది. ఈనేపథ్యంలో మనలో చాలామంది కొత్త పెట్టుబడి ప్రణాళికలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. మార్చి నెల అనేది వ్యక్తిగత ఫైనాన్స్ కోణం నుంచి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నెలలో పాన్ ఆధార్ లింక్ చేయడం నుంచి పన్నుల ప్రణాళిక వరకు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావాలి . వీటిని కోల్పోవడం అంటే మీరు జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. లేదా ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. రూ.1000 పెనాల్టీతో పాటు ఇప్పుడు పాన్ , ఆధార్‌ను లింక్ చేయవచ్చు. మీరు చివరి గడువు కంటే ముందు రెండు ID కార్డ్‌లను లింక్ చేయకపోతే.. మీ పాన్ పనిచేయదు. పెనాల్టీ లేకుండా పాన్ , ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 2022 జూన్ 30నే ముగిసింది.

అప్ డేట్ చేసిన ITR ఫైలింగ్:

2020 ఆర్ధిక సంవత్సరం లేదా అసెస్‌మెంట్ ఇయర్ 2020-21 కోసం అప్‌డేట్ చేయబడిన ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ని సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31. పన్ను చెల్లింపుదారులు 2020 ఆర్ధిక సంవత్సరంలో ITRను ఫైల్ చేసేటప్పుడు నిర్దిష్ట ఆదాయ వివరాలను విస్మరించినా లేదా ఏదైనా పొరపాటు చేసినా తప్పనిసరిగా అప్ డేట్ చేసిన ITRని ఫైల్ చేయాలి. 2020 ఆర్థిక సంవత్సరంలో ITR ఫైల్ చేయకపోతే కూడా ఫైల్ చేయవచ్చు. అయితే, సున్నా లేదా ప్రతికూల రాబడి ఉన్నవారు అప్ డేట్ చేసిన ITRని ఫైల్ చేయలేరు.

ఫారం 12BB:

ఫారమ్ 12BB ఫైల్ చేయడానికి చివరి తేదీ కూడా మార్చి 31వ తేదీ… జీతం పొందే ఉద్యోగి తమ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు లేదా రాయితీలను క్లెయిమ్ చేయడానికి ఈ ఫారమ్‌ను తప్పనిసరిగా యజమానికి సమర్పించాలి. ఇది జూన్ 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. ఫారమ్‌లో తప్పనిసరిగా చేర్చాల్సిన కొన్ని అంశాల్లో ఇంటి అద్దె అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ రాయితీలు (LTC), హోమ్ లోన్‌పై వడ్డీ ఉన్నాయి.

ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్:

మార్చి 31కి ముందు చేసిన పెట్టుబడులు, 2023 ఆర్ధిక సంవత్సరానికి ITR ఫైల్ చేస్తున్నప్పుడు పాత ఆదాయపు పన్ను విధానంలో మిన హాయింపును పొందేందుకు అందుబాటులో ఉంటాయి.  ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో రూ. 1.5 లక్షల పరిమితితో తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కోసం కొన్ని పెట్టుబడి మార్గాలను చూడొచ్చు.

అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్:

10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా  ముందస్తు పన్ను చెల్లించాలి . ఇది నాలుగు వాయిదాలలో చెల్లిస్తారు. బకాయి పన్నులో 15 శాతం జూన్ 15 నాటికి, తదుపరి 30 శాతం సెప్టెంబర్ 25 నాటికి, మరో 30 శాతం డిసెంబర్ 15 నాటికి, మిగిలిన 25 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 15 నాటికి చెల్లించబడుతుంది.

ఒకవేళ వ్యక్తి తమ ఉద్యోగాన్ని మార్చుకున్నట్లయితే లేదా అదనపు ఆదాయాన్ని కలిగి ఉన్నట్లయితే, వారు మార్చి 31లోగా అదనపు పన్నును ముందుగానే లెక్కించి, చెల్లించాలి. ఆ తర్వాత ఆలస్యమైతే, పన్ను చెల్లింపు దారుడు చెల్లించాల్సిన మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు.

Also Read:  Good Bacteria in Gut: మన గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు