Robot Mantra: స్వదేశీ సర్జికల్ రోబో “మంత్ర” అదుర్స్

భారతదేశానికి (India) చెందిన స్వదేశీ సర్జికల్ రోబో 'మంత్ర' అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

భారతదేశానికి చెందిన స్వదేశీ సర్జికల్ రోబో ‘మంత్ర’ (Robot Mantra) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది ఎన్నో సర్జరీలు అవలీలగా చేస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది? మేడ్ ఇన్ ఇండియా రోబో మంత్ర (Robot Mantra) గురించి ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ‘మంత్ర’ ను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వినియోగంలోకి తెచ్చారు. ఈ రోబోటిక్ సిస్టమ్ ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో అమర్చబడింది. విశేషమేమిటంటే ఈ రోబోను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తో డెవలప్ చేశారు. ఇది అనేక రకాల శస్త్రచికిత్సలు చేయగలదు.

గురుగ్రామ్‌కు చెందిన ఎస్‌ఎస్ ఇన్నోవేషన్ కంపెనీ ఈ రోబోను తయారు చేసింది. దీనికి ‘మంత్ర’ అని పేరు పెట్టింది. కోయం బత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంత్ర రోబోను అమర్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు పలు ఆసుపత్రుల్లో ఈ రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎస్‌ఎస్ ఇన్నోవేషన్ కంపెనీ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవకు చెందినది. ఆయన స్వయంగా కార్డియో థొరాసిక్ సర్జన్ , రోబోటిక్ సర్జరీలో నిపుణుడు. ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా సామాన్య ప్రజలు అత్యాధునిక వైద్య సేవలను పొందడం సులభతరం అవుతుందని ఆయన అంటున్నారు.

సర్జరీ ఇలా..

‘మంత్ర’ రోబోటిక్ సిస్టమ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, దానిలోని ప్రతి భాగం పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడింది. అంటే, ఈ మొత్తం రోబోటిక్ వ్యవస్థ ‘దేశీ’.

  1. ఈ రోబోలో మొత్తం నాలుగు వర్కింగ్ ఆర్మ్స్ అమర్చారు. స్టేట్ వర్కింగ్ ఆర్మ్‌లో కెమెరా అమర్చబడింది.
  2. కెమెరా చిత్రాలను వీక్షించడానికి LED స్క్రీన్ ఉంది.
  3. ఈ మొత్తం వ్యవస్థను నిర్వహించడానికి ఒక వైద్యుడు అవసరం.
  4. ఆపరేటింగ్ సిస్టమ్‌లో హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది.దీని ద్వారా మొత్తం రోబోట్ నియంత్రించ బడుతుంది.
  5. ఈ వ్యవస్థలో మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది సర్జన్ కమాండ్ సెంటర్, అక్కడ నుంచి డాక్టర్ దానిని పర్యవేక్షిస్తారు.
  6. రెండోది పేషెంట్ సైడ్ ఆర్మ్ కార్ట్‌లు.. ఇక్కడి నుంచి రోగికి రోబోట్ సర్జరీ చేస్తుంది.
  7. మూడవది విజన్ కార్ట్.ఇక్కడ నుంచి డాక్టర్ మొత్తం ఆపరేషన్‌ని చూడగలుగుతారు.

ఈ రోబో ఏ శస్త్రచికిత్సలు చేయగలదు?

ఈ రోబో అనేక శస్త్రచికిత్సలు చేయడానికి ఉపయోగ పడుతుంది. రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం ఈ రోబో 25 రకాల సర్జరీలు చేస్తోంది. దీని ద్వారా యూరాలజీ క్యాన్సర్, గైనకాలజీ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్, కార్డియో థొరాసిక్ సర్జరీలు కూడా చేయవచ్చు.

మంత్ర సర్జరీ చేస్తే ఇవీ ప్రయోజనాలు

ఈ రోబోటిక్ సిస్టమ్ అత్యంత చౌకైనదని వైద్యులు పేర్కొన్నారు.  దీని యూనిట్ ఖరీదు 4 నుంచి 5 కోట్లు మాత్రమే.  అయితే ఇతరత్రా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్స్ కొనాలంటే 17 కోట్ల దాకా ఖర్చవుతుంది. వాటితో పోలిస్తే మంత్ర రోబో ధర తక్కువే.
అంతే కాకుండా మంత్ర రోబోటిక్ సిస్టమ్‌తో సర్జరీ చేసేటప్పుడు పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం ఉండదు. కోతలు తక్కువగా ఉండటం వల్ల రోగికి నొప్పి కూడా తక్కువగా ఉంటుంది.మంత్రం రోబోట్ తో శస్త్రచికిత్స చేయుంచుకున్న తర్వాత, రోగి కోలుకోవడానికి రెండు నుండి మూడు రోజులే పడుతుంది. సాధారణ శస్త్రచికిత్సకు చాలా సమయం పడుతుంది.

Also Read:  Bad Smell From Mouth: మీకు నోటి దుర్వాసన బాగా వస్తుందా.. ఇలా తొలగించుకోండి