Veg Maggie: వెజ్ మ్యాగీ ఇలా చేస్తే చాలు.. పిల్లలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు?

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 09:35 PM IST

మాములుగా చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో అలాగే ఉదయం టిఫన్ టైంలో ఎక్కువగా మ్యాగీ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం పిల్లలు మ్యాగీని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇప్పుడు మామూలు మ్యాగీ కాకుండా అప్పుడప్పుడు వెజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ అంటూ రకరకాల మ్యాగీలను ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజ్ మ్యాగీ ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకు ఏ పదార్థాలు కావాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కావాల్సిన పదార్థాలు :

నీరు, మ్యాగి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, కొద్దిగా ఉప్పు, క్యారెట్, కొద్దిగా ఆనియన్స్ అని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి.

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా తో పై కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. క్యారెట్ వేసి బాగా వేగాక అందులో కొంచెం వాటర్ పోయాలి. తర్వాత మ్యాగీ పౌడర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేయాలి. మ్యాగీ బాగా ఉడుకుతున్న సమయంలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మ్యాగీ రెడీ. చేస్తే పిల్లలు లొట్టలు వేసుకుని మరి తినేస్తారు.