Fight Inferiority Complex: ఆత్మన్యూనతకు నై.. ఆత్మవిశ్వాసానికి జై!!

ఆత్మన్యూనతా భావం.. చిన్న, పెద్ద.. యూత్, వృద్ధులు, పిల్లలు.. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిని వెంటాడే రుగ్మత.

  • Written By:
  • Publish Date - August 19, 2022 / 07:30 AM IST

ఆత్మన్యూనతా భావం.. చిన్న, పెద్ద.. యూత్, వృద్ధులు, పిల్లలు.. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిని వెంటాడే రుగ్మత.

ఆత్మన్యూనతా భావం అంటే.. మనల్ని మనం తక్కువగా భావించడం. మనసును చిన్నబుచ్చుకోవడం. నిరాశా వాదానికి లొంగిపోవడం. ఒకవేళ మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఇప్పటికైనా వాటిని వదిలేయండి. మీకు బంగారు భవిష్యత్తు ఉందని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరే నమ్మకుంటే..మీపై మీకే విశ్వాసం లేకుంటే.. వేరే వాళ్ళు మాత్రం ఎలా నమ్ముతారు? కాబట్టి ఇక నుంచి ఆత్మ విశ్వాసంతో.. జీవితంలో ప్రతి సవాల్ ను ఎదురుకోండి. ఓటమి నుంచి పాఠం నేర్చుకోండి తప్ప నీరుగారి పోవద్దు. భగీరథ ప్రయత్నం చేస్తే విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. మిమ్మల్ని చిన్న బుచ్చేలా ఎవరైనా మాట్లాడితే పట్టించుకోకండి. కామ్ గా వాళ్ళ మాటలు వినండి. రాబోయే మీ విజయమే మాట్లాడాలి .. అంతే తప్ప మీరు గొంతు చించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.

ఆత్మ న్యూనతా భావానికి గురి కాకూడదంటే..

* ఈ రుగ్మత నుంచి ఎస్కేప్ అవ్వాలంటే? మీరు ఎవరిపైనా ఆధారపడకూడదు. ఎందుకంటే అంతవరకు మీ వెంట ఉన్నవారు ఒక్కసారిగా వెళ్లిపోతే మీరు ఒత్తిడికి గురై తేరుకోవడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. మీకై మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి అలవాటుపడండి.

* ఏ పని చేసినా మీరు మీపై విశ్వాసాన్ని సాధించండి. మీకు తెలియని విషయాల కోసం ఇతరుల సాయం కోరవచ్చు, కానీ అదే అలవాటుగా చేసుకోకండి.

* మీకు నష్టాలు వస్తే మీ వెనకుండే వారిని సలహాలు అడగండి. తప్పక విజయం మీదే అవుతుంది.

* ఎవరు మన వెంట ఉన్నా, లేకపోయినా మనంతట మనం పనులు సాధించుకోగలిగే సత్తా ఉండాలి. అప్పుడే జీవితంలో విజయాలను సాధించగలమని నిపుణులు సూచిస్తున్నారు.

* జీవితంలో కొన్ని సందర్భాలలో మంచి అవకాశాలు వస్తాయి. అలా మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

* చాలామంది తమకు అవకాశాలు రావడం లేదనే నెగిటివ్ భావనలో ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో చాలామంది ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. ఈ నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడితే మాత్రమే లక్ష్య సాధన వైపు అడుగులు వేయవచ్చు.

* అందివచ్చిన అవకాశాలను జారవిడచుకుంటే నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. మనలో ఉన్న నెగిటివ్ భావనను వీడితే లక్ష్యాలను అందుకొని విజయాలను సాధించవచ్చు.

వీళ్ళు 3 రకాలు..

* డిప్రెష‌న్ రోగుల‌ను.. స్వ‌ల్ప‌, మధ్య‌స్థం, తీవ్రం అనే మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తారు. వీటి ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తారు.

* సాధార‌ణంగా ఎక్కువ మందికి కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ)తో చికిత్స ప్రారంభిస్తారు. ఇది ఒక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌. దీనిలో భాగంగా నెగెటివ్ ఆలోచ‌న‌లు, తీవ్ర‌మైన బాధ‌కు కార‌ణాలు గుర్తించి.. వాటిని అధిగ‌మించేందుకు వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు.

* ప్ర‌తికూల ఆలోచ‌న‌ల మూలాల‌తోపాటు వాటిని అధిగ‌మించే మార్గాలూ తెలుసుకోవ‌డం ద్వారా.. ప్ర‌తికూల ప్ర‌వ‌ర్త‌న‌ల జోలికి పోకుండా అడ్డుకోవ‌చ్చు.

* కుంగుబాటు తీవ్రంగా ఉంటే.. యాంటీ-డిప్రెసెంట్ ఔష‌ధాల‌ను వైద్యులు సూచిస్తారు. ఇవి భావోద్వేగాల‌ను ప్ర‌భావితం చేసే మెద‌డులోని ర‌సాయ‌న చ‌ర్య‌ల‌ను క్రియాశీలం చేస్తాయి. దీంతో కొంత‌వ‌ర‌కు నిస్సత్తువ‌‌, నిరాశ‌, భావోద్వేగ స‌మ‌స్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. అయితే ఈ ఔష‌ధాల‌తో కొన్ని ప్ర‌తికూల ప్ర‌భావాలూ ఉంటాయి.

* కొంతమంది రోగుల‌కు ధ్యానం, వ్యాయామం, మ్యూజిక్‌, ఆర్ట్ థెర‌పీల‌ను సూచిస్తారు.