Hair Fall Month: ఆ నెలలో జుట్టు బాగా రాలుతుందట.. హెయిర్ ఫాల్ ను ఆపే చిట్కాలివి!!

జుట్టు రాలే సమస్యను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. దాన్ని ఎలా అధిగమించాలో తెలియక సతమతం అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 06:30 AM IST

జుట్టు రాలే సమస్యను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. దాన్ని ఎలా అధిగమించాలో తెలియక సతమతం అవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.ఈ సీజన్‌లో తేమ వాతావరణం కారణంగా చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది.

కొందరికి అన్ని సీజన్లలో జుట్టు రాలుతూ ఉంటుంది. మరికొందరికి నిర్దిష్ట సీజన్ లోనే రాలుతుంది. అయితే ఏడాది పొడవునా ఏ సీజన్‌లో ఎక్కువ జుట్టు రాలుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నిపుణుల అంచనా ప్రకారం, ఏటా సెప్టెంబరు నెలలో జుట్టు రాలడం ఎక్కువగా జరుగుతుంది. ఉష్ణోగ్రత ఒత్తిడి దీనికి కారణం. సెప్టెంబరులో గరిష్టంగా జుట్టు రాలుతుందని, జనవరి నాటికి జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, జీవనశైలిలో మార్పులు చేస్తే ఊడిపోయిన జుట్టును తిరిగి పొందొచ్చు.

మానసిక ఒత్తిడితో ముప్పు..

మానసిక ఒత్తిడి శరీరానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా ప్రమాదకరం. ఒత్తిడి వల్ల శరీరం యొక్క అడ్రినలిన్, కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఇది జుట్టు యొక్క సహజ పెరుగుదల ప్రక్రియను దిగజార్చుతుంది.జన్యు కారణాలు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలోని ప్రతికూల అంశాల వల్ల జుట్టు రాలుతుంటుంది. ఆహారంలో విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రొటీన్, ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. హెయిర్‌కేర్ బ్రాండ్ నియోక్సిన్ 2000 మందిపై చేసిన పరిశోధనలో ప్రతి పది మందిలో ఆరుగురికి జుట్టు రాలుతున్నట్లు తేలింది. సూర్యరశ్మి వల్ల జుట్టు విరగకుండా సాధారణంగా నివారించవచ్చని సూచిస్తున్నారు.

34 సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే..

34 సంవత్సరాల వయస్సు నుంచి మనుషుల జుట్టు సన్నబడటం ప్రారంభమవుతుంది. జుట్టు పలచబడిన తర్వాత, 41 శాతం మంది ప్రజలు తమ జుట్టును ఇతరులు ఎగతాళి చేయకుండా దాచడానికి ప్రయత్నిస్తారు. వారు తమ జుట్టును దాచుకోవడానికి టోపీలు లేదా ఇతర వస్తువులను ఉపయోగిస్తారు.

హెయిర్ ఫోలికల్ స్టెమ్ సెల్స్ తగ్గిపోతాయి..

అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకునే వారు, స్థూలకాయం ఉన్నవారిలో హెయిర్ ఫోలికల్ స్టెమ్ సెల్స్ (HFSCs) తగ్గిపోతాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల జుట్టు పెరుగుదల నిలిచిపోతుంది. దీని వల్ల జుట్టు మళ్లీ పెరగదు లేదా జుట్టు కుదుళ్లకు చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా హెచ్‌ఎఫ్‌ఎస్‌సిలు అనేది మన జుట్టు పెరుగుదలను కొనసాగించే కీలక ప్రక్రియ.