Guava Fruit : జామకాయల్లో ఎన్ని పోషకాలు, విటమిన్లు ఉన్నాయో తెలుసా ?

ఇప్పటికీ పల్లెటూళ్లలో చూస్తే అక్కడక్కడా జామచెట్లు కనిపిస్తుంటాయి. జామకాయల్లో ఎన్ని విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో చాలా మందికి తెలీదు. సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి తింటారు. ఇవి తెలిస్తే.. జామకాయను(Gauva) తినడం అసలు మిస్ చేయరు.

  • Written By:
  • Updated On - May 9, 2023 / 11:37 PM IST

Guava Fruit :  మన పూర్వీకుల కాలంలో ప్రతి ఇంటి పెరట్లో జామ, మామిడి, ఉసిరి, నారింజ, దానిమ్మ వంటి పండ్ల చెట్లు ఉండేవి. సహజంగా పండిన పండ్లు(Fruits) తినడం వల్లే వారికి అంత త్వరగా రోగాలు దరిచేరేవి కావు. కానీ ఈ రోజుల్లో మార్కెట్లలో లభించే పండ్లలో ఏవీ సహజంగా పండినవి ఉండవు. కొన్ని మాత్రం సహజసిద్ధంగా పండినవి వస్తుంటాయి. వాటిలో జామకాయలు కూడా. ఇప్పటికీ పల్లెటూళ్లలో చూస్తే అక్కడక్కడా జామచెట్లు కనిపిస్తుంటాయి. జామకాయల్లో ఎన్ని విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో చాలా మందికి తెలీదు. సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి తింటారు. ఇవి తెలిస్తే.. జామకాయను(Gauva) తినడం అసలు మిస్ చేయరు.

జామకాయల్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఉసిరిలో కంటే.. జామకాయలో రెండురెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కూడా అధిక మొత్తంలో లభిస్తాయి. ఫోలేట్, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే జామకాయ రోజుకొకటైనా తింటే.. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది.

జామకాయ లేదా జామ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడమే కాకుండా.. తెల్లరక్త కణాల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. అంటువ్యాధులతో కూడా పోరాడుతుంది.

జామకాయలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ అస్థిర అణువులు, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి దీర్ఘకాలిక రక్షణ కలిగిస్తాయి.

జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లను కూడా కలిగి ఉంటుంది.

జామకాయల్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. మధుమేహం ఉన్న వారు ప్రతిరోజూ జామకాయ తింటే చక్కెర స్థాయి కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తమ డైట్ లో జామకాయను ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు.

జామకాయలతో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి.