Site icon HashtagU Telugu

Gun Culture Ban: గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?

Who Is Given A Gun License.. What Does Indian Arms Act Say..

Who Is Given A Gun License.. What Does Indian Arms Act Say..

గన్ లైసెన్స్ (Gun Licence) ఇప్పుడు ఈ టాపిక్ పై హాట్ డిబేట్ నడుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా 3.73 లక్షల పైచిలుకు గన్ లైసెన్సులు ఉన్నట్లు వెల్లడి కావడం కలకలం రేపింది. గత కొన్ని నెలలుగా పంజాబ్ లో గన్ ఫైర్ ఘటనల్లో ఎంతోమంది చనిపోయారు. వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకునేందుకు గన్స్ ను దుర్వినియోగం చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన గన్స్ ను బల ప్రయోగం, హత్యల కోసం వాడటం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం నామమాత్రంగా 813 గన్ లైసెన్సు లు రద్దు చేసి చేతులు దులుపుకుంది. ఈనేపథ్యంలో గన్ లైసెన్సు (Gun Licence) కు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ” 1959 భారత ఆయుధ చట్టం” ఆమోదించబడింది. దీంతో 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తీసుకొచ్చిన 1878 పూర్వపు చట్టం రద్దు అయింది. భారతీయులు తుపాకీలను కలిగి ఉండకుండా చేసింది.1959 చట్టం ప్రకారం.. లైసెన్స్ లేకుండా భారతదేశంలో ఎవరూ ఎలాంటి తుపాకులను కలిగి ఉండలేరు.

1983లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం.. ఒక వ్యక్తి లైసెన్స్ పొందిన డీలర్, యూనియన్‌లోని సాయుధ దళాలకు చెందిన వ్యక్తి లేదా రైఫిల్ క్లబ్ లేదా అసోసియేషన్‌లో సభ్యుడిగా లైసెన్స్ పొందిన లేదా గుర్తింపు పొందిన వ్యక్తి అయితే తప్ప గన్ కలిగి ఉండకూడదు. ఈ సవరణ తర్వాత.. ఒక వ్యక్తి మూడు కంటే ఎక్కువ తుపాకీలను తీసుకెళ్లకుండా చట్టం నిషేధిస్తుంది.

ఇవీ అర్హతలు.. ఇలా ఇస్తారు..

  1. భారత ఆయుధాల చట్టం ప్రకారం.. 21 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు నాన్ – ప్రోహిబిటెడ్ బోర్ (NPB) తుపాకులను పొందొచ్చు. బోర్ అనేది తుపాకీ బుల్లెట్ల వ్యాసాన్ని సూచిస్తుంది.
  2. 35, 33, 22 మరియు 380కి కట్టుబడి ఉన్న NPB తుపాకులు లైసెన్స్ కోసం అనుమతించబడతాయి.
  3. 38, 455 మరియు 303 బోర్ల నిషేధిత బోర్ గన్‌ లైసెన్సు లు రక్షణ సిబ్బందికి లేదా ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వ్యక్తులకు మాత్రమే జారీ చేయబడతాయి.
  4. ఆత్మరక్షణ, పంట రక్షణ లేదా క్రీడల ప్రయోజనాల కోసం మాత్రమే గన్ లైసెన్స్ మంజూరు చేయబడుతుంది.
  5. భారత ఆయుధాల చట్టంలోని సెక్షన్ 9 అనేది.. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు లేదా బాండ్‌లో ఉన్నవారు అలాంటి లైసెన్స్ పొందకుండా నిరోధిస్తుంది.
  6. NPB ఆయుధాల లైసెన్స్ మంజూరు కోసం దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం/DM సంబంధిత పోలీసు అధికారుల నివేదిక ఆధారంగా పరిష్కరిస్తుంది.
  7. దరఖాస్తుదారు పూర్వీకులు మరియు కుటుంబ వివరాల యొక్క సమగ్ర నేపథ్య తనిఖీ తర్వాత గన్ లైసెన్స్ ఇస్తారు.

2019 డిసెంబర్ సవరణ:

2019 డిసెంబర్ లో భారత ఆయుధాల చట్టానికి చేసిన సవరణ ప్రకారం.. అనుమతించ బడిన తుపాకుల సంఖ్యను మూడు నుండి ఒకటికి తగ్గించారు. ఒకటికి మించి తుపాకులు ఉన్నవారు వాటిని సమీప పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జ్ లేదా లైసెన్స్ పొందిన తుపాకీ డీలర్ లేదా యూనిట్ వద్ద డిపాజిట్ చేయడానికి ఒక సంవత్సరం వ్యవధిని ఇచ్చింది. ఈ సవరణ తుపాకీ లైసెన్స్ యొక్క చెల్లుబాటు వ్యవధిని మూడు నుండి ఐదు సంవత్సరాలకు పెంచింది.

ఆయుధ నియమాలు – 2016 ఏమిటి?

2016లో కేంద్రం కొత్త ఆయుధాల నియమాలను జారీ చేసింది. “ఆయుధాల నియమాలు 1962″ను రద్దు చేసింది. కొత్త నియమాల ప్రకారం.. ఆయుధాల లైసెన్స్ కోరుకునే వారు ఏదైనా రైఫిల్ క్లబ్ లో సభ్యత్వం పొంది గన్ వినియోగం, నిర్వహణపై శిక్షణ పొందాల్సి ఉంటుంది.

Also Read:  RCB Women’s Team: అదే కథ.. అదే వ్యథ