Union Budget 2024 : ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. ఫోకస్ ఈ 5 అంశాలపైనే !

Union Budget 2024 : ఫిబ్రవరి 1న  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించబోయే బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 07:07 PM IST

Union Budget 2024 : ఫిబ్రవరి 1న  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించబోయే బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అయినా ఇది సార్వత్రిక ఎన్నికల టైం కావడంతో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. దేశంలోని వివిధ  వర్గాల అంచనాలు కూడా పెరిగాయి. ఏప్రిల్-మేలో దేశంలో కొత్త సర్కారు ఏర్పాటయ్యాక పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి మధ్యంతర బడ్జెట్‌‌లో ప్రాధాన్యత పొందే అవకాశమున్న 5 ప్రధాన అంశాల(Union Budget 2024) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

సంక్షేమం

ఈసారి మధ్యంతర బడ్జెట్‌‌లో సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సర్కారు నిధులను పెంచే ఛాన్స్ ఉంది. పన్ను రాబడిని పెంచేందుకు ఉన్న మార్గాలను పెంచేందుకు కసరత్తు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రత్యక్ష పన్నుల బడ్జెట్ అంచనా లక్షల కోట్లను మించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

వినియోగం

మనదేశంలో ప్రైవేట్ వినియోగం 2019 నుంచి వేగంగా పెరుగుతోంది. అవసరమైన అంశాలపై మాత్రమే ఖర్చు చేసే ధోరణి మనదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. మనదేశ వినియోగ మార్కెట్లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు కేంద్ర సర్కారు కొన్ని చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది. వ్యవసాయ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తూనే.. దేశ ప్రజల వినియోగ శక్తిని పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి చేయనున్నారు.

ఉద్యోగాలు

ఏటా 10 లక్షల కంటే ఎక్కువ మంది యువత భారతదేశ శ్రామిక శక్తిలో కొత్తగా చేరుతున్నారు. వీరికి సరైన అవకాశాలను కల్పించడం అత్యవసరం.  ఇది ప్రభుత్వ బాధ్యత. దీన్ని నెరవేర్చేందుకుగానూ గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపును పెంచనున్నారు. సేవలు, రసాయనాల వంటి పరిశ్రమలకు పీఎల్ఐ పథకం ప్రోత్సాహకాలను విస్తరించే అవకాశం ఉంది.

ద్రవ్యలోటు

ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ ఈసారి దేశ బడ్జెట్‌పై ద్రవ్యలోటు ప్రభావం లేకుండా చూసేందుకు కేంద్ర సర్కారు యత్నించనుంది. ఒకవేళ ఎన్నికలలో ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ కేటాయింపులతో ప్రత్యేక పథకాలను అనౌన్స్ చేస్తే మాత్రం భారీ ద్రవ్యలోటు తప్పక ఎదురవుతుంది. బడ్జెట్‌లో ద్రవ్యలోటును దేశ జీడీపీలో 5.3 శాతానికి తగ్గించే చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి చేపడతారనే అంచనాలు వెలువడుతున్నాయి.

మూలధన వ్యయం

మోడీ సర్కారు గత ఐదేళ్లలో దేశంలోని మౌలిక సదుపాయాలను చాలా డెవలప్ చేసింది. ఈ పనుల వల్ల ప్రజలు చాలా ప్రభావితులయ్యారు. ఈ ఫలితంగానే ఉత్తరాదిలోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి బంపర్ విక్టరీ లభించింది. ఈసారి మధ్యంతర బడ్జెట్‌లోనూ మౌలిక సదుపాయాల రంగం కోసం మూలధన వ్యయాన్ని పెంచే ఛాన్స్ ఉందట.

Also Read :Ayodhya Ram New Name : అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?