Onion Battle : రైతుల ధీన‌గాధ‌!పాకిస్తాన్ లో రూ. 250లు,ఇండియాలో రూ. 1లు

భార‌తదేశంలో ఉల్లి ధ‌ర కిలో ఒక రూపీ(రూ.1). ప‌క్క‌నే ఉన్న

  • Written By:
  • Updated On - February 28, 2023 / 04:57 PM IST

భార‌తదేశంలో ఉల్లి ధ‌ర కిలో ఒక రూపీ(రూ.1). ప‌క్క‌నే ఉన్న పాకిస్తాన్ కిలో రూ. 250ల‌కు బ‌హిరంగ మార్కెట్లో(Onion Battle) విక్ర‌యిస్తోంది. ఇంత పెద్ద వ్య‌త్యాసం ఎందుకు ఉంది? భార‌త దేశ(India) రైతులు ఉల్లిని రోడ్ల మీద పారేస్తుంటే, పాకిస్తాన్ ప్ర‌జ‌లు ఉల్లిపాయ‌లు కొనుగోలు చేయ‌లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో 36 అంగుళాల ఛాతి చూపించే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భార‌త రైతుల‌ను ఆదుకోలేరా? రైతు క‌ష్టం రోడ్డు పాలువుతంటే పాల‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఎలాంటి రాజ‌నీతి అనుకోవాలి? నాసిక్ కేంద్రంగా ఉల్లిపాయల‌ను రోడ్ల మీద పోస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న రైతుల వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

నాసిక్ కేంద్రంగా ఉల్లిపాయల‌ను రోడ్ల మీద పోస్తూ నిర‌స‌న (Onion Battle)

ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయల కొరత నానాటికీ పెరుగుతోంది. ఉల్లి సంక్షోభంతో (Onion Battle) ప్ర‌పంచం పోరాడుతోంది. ఆ విష‌యాన్ని గత నెలలో ప్రపంచ బ్యాంక్ వెల్ల‌డించింది. త‌ద్భిన్నంగా భార‌త‌దేశంలో ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులు పండించిన ఉల్లి కొన్ని చోట్ల కుళ్లిపోతోంది. మ‌రికొంద‌రు పొలాల్లోనే పంట‌ను వదులుకుంటున్నారు. ఉల్లి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లేక‌ కన్నీళ్ల ప‌ర్వంతం అవుతున్నారు. ఇదీ స్తూలంగా భార‌త‌దేశంలోని ఉల్లి రైతుల ధీన‌గాధ‌.

Also Read : Onions: ఎరుపు లేదా తెలుపు ఏ రంగు ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది?

పాకిస్థాన్ వంటి దేశాల్లో ఉల్లి ధర కిలో ₹250కి పెరిగింది. ఆసియాలో అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన నాసిక్ లో మాత్రం రైతులు కిలోకు ₹1 కంటే తక్కువకు విక్ర‌యిస్తున్నారు. దిగ్భ్రాంతికరంగా(Onion Battle) పంట రేటు తక్కువగా ఉండటంతో రోడ్డుపై పడేస్తూ వెళుతోన్న ఓ రైతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి వ్యాపార కేంద్రమైన నాసిక్‌లో ఉల్లి ధరలు పడిపోవడం ఆందోళనకు దారితీసింది. కేంద్రం జోక్యం చేసుకుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. మిగులు ఉల్లి పంటను కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారి నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  ని కోరింది. ఉల్లి కొర‌త ఉన్న రాష్ట్రాల‌కు విక్రయించాలని రైతులు కోరుతున్నారు. కమీషన్లు, స్థానిక మార్కెట్ పన్నులు చెల్లించిన తర్వాత కూడా కిలోకు ₹1-2 వ‌ర‌కు బ‌హిరంగ మార్కెట్లో ఉల్లిపాయ‌లు ల‌భిస్తున్నాయి. దీంతో రైతులు అమ్ముకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. నాసిక్ కు చెందిన ఒక రైతు పండించిన 512 కిలోల శీతాకాలపు ఉల్లిని కిలోకు ₹1కి విక్రయించారు.

ఉల్లి ధర 350% పెరగడంతో ద్రవ్యోల్బణం పాకిస్థాన్‌ను తాకింది

పాకిస్తాన్ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఫిబ్రవరిలో 41.54% ద్రవ్యోల్బణంలో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఉల్లి ధరలు 371% పెరిగాయి. దేశంలో ఉల్లితో పాటు ఇంధనం, ఆహారం, విద్యుత్ వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నిత్యావ‌స‌రాలుగా ఉన్న 51 వస్తువులలో, 34 వస్తువుల ధరలు పెరిగాయి. ఐదు వస్తువులు తగ్గాయి. 12 వస్తువుల ధరలు మారలేదు. పెట్రోల్ ధర లీటరుకు ₹272కి పెరిగింది.

నాసిక్‌లో ఉల్లిపాయల ధర ఎందుకు తగ్గుతోంది?

ఉల్లి ధరలు మార్కెట్‌లో తీవ్ర అస్థిరత ఏర్ప‌డింది. ఒక్కోసారి ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు కార‌ణంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతిని నిలిపివేయవలసి వచ్చింది. మహారాష్ట్రలో 15 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడం కార‌ణంగా ఉల్లి ధరల పతనానికి ప్రధాన కారణం. రైతులు ఏడాది పొడవునా మూడు సీజ‌న్ల‌లో ఉల్లిని పండిస్తారు. అంటే, ఖరీఫ్ (సెప్టెంబర్-అక్టోబర్‌లో పండిస్తారు), చివరి ఖరీఫ్ (జనవరి-ఫిబ్రవరిలో పండిస్తారు), మరియు రబీ (మార్చి-ఏప్రిల్‌లో పండిస్తారు). ఖరీఫ్ ఉల్లిపాయలను జనవరిలో విక్రయిస్తారు. ఖరీఫ్ చివరిలో పండించిన ఉల్లిని మే-జూన్‌లో విక్రయిస్తారు.

ఉష్ణోగ్రతలు పెరగడంతో రైతులు ఈసారి ఖరీఫ్ చివరి పంటలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ మరియు చివరి ఖరీఫ్ పంట ఒకేసారి కు రావ‌డంతో దారుణంగా ధ‌ర ప‌డిపోయింది. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకస్మిక వేడి-షాక్ కారణంగా ప్రస్తుత ఉల్లి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. సరైన నిల్వ సౌకర్యం లేకపోవడం కూడా రైతుల కష్టాలకు తోడైంది.

Also Read : Modi: పాకిస్తాన్‌కు మోదీ కావాలి… నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో!