Mira Kulkarni: కొవ్వొత్తుల తయారీ.. కోట్లు సంపాదిస్తున్న మహిళ.. సక్సెస్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే?

మీరా కులకర్ణి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది కాస్మోటిక్. కాస్మోటిక్ క్వీన్ గా గుర్తింపు త

  • Written By:
  • Updated On - July 2, 2023 / 08:52 PM IST

మీరా కులకర్ణి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది కాస్మోటిక్. కాస్మోటిక్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. చదువుని పక్కన పెట్టు మరీ 20ఏళ్ల వయసులోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళగా ఆ బంధం కొద్ది రోజులకే వికటించడంతో ఒంటరితల్లిగా తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. కొద్ది రోజులకు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారింది. అలా కొంతకాలం పాటు కాలాన్ని నెట్టుకు వచ్చిన ఆమె 45 సంవత్సరాల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టింది.

అలా అంచెలంచలుగా ఎదుగుతూ దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచింది మీరా కులకర్ణి. ఈమె ఫారెస్ట్ ఎసెన్షియల్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఇది దేశంలోని ప్రముఖ సహజ సౌందర్య సాధనాల బ్యాండ్ లలో ఒకటి. ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులకు బాగా ప్రసిద్ధి చెందింది. మార్కెట్ లీడర్ గా విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించిన మీరా కులకర్ణి ప్రయాణం మొదట కొవ్వొత్తుల తయారీ చేసే చిన్న కుటీర పరిశ్రమ నుంచి నెమ్మదిగా హ్యాండ్ మేడ్ సబ్బులు పరిశ్రమగా మారింది.

ఆమె వైవాహిక బంధం ఫలించకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. 28 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. ఇంటిలోనే కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి అలా వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. అలా కూతురికి పెళ్లి చేసిన తర్వాత 45 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని ప్రారంభించింది. యువత యూఎస్ లో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన సలహాలతోనే సభ్యుల తయారీలో శిక్షణ పొందింది. కేవలం ఆమె మాత్రమే కాకుండా ఆమె కొడుకు సమర్త్ బేడీ కూడా ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.