No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్

No Holiday : సాధారణంగా శని, ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీసులకు సెలవు.

  • Written By:
  • Updated On - March 30, 2024 / 01:26 PM IST

No Holiday : సాధారణంగా శని, ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీసులకు సెలవు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC),  ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం కార్యాలయాలు ఇవాళ, రేపు కూడా పని చేయనున్నాయి. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున.. నేడు, రేపు ఆ ఆఫీసులన్నీ దేశవ్యాప్తంగా తెరిచి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు మార్చి 31. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏ పనినైనా చివరి రోజుల్లో పూర్తి చేసుకునే విషయంలో కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూసేందుకే LIC, ఐటీ విభాగాలు(No Holiday) ఈ నిర్ణయం తీసుకున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా, శని, ఆదివారాల్లో పని చేయాలని అన్ని ఏజెన్సీ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గతంలోనే ఆదేశించింది. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులు సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తో సహా అన్ని ప్రధాన బ్యాంకులు శని, ఆదివారాల్లో పని చేస్తాయి. ఇవాళ,రేపు చెక్ క్లియరింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు నిరాటంకంగా పని చేస్తాయి. స్పెషల్‌ డిపాజిట్‌ పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర ‍‌(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్‌ చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్చి 31 చివరి రోజు కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను సైతం అనుమతిస్తారు.

Also Read :World Backup Day 2024 : వాట్సాప్‌లో డేటా బ్యాకప్ ఎలాగో తెలుసా ?

ఏప్రిల్‌ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్

బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పాలసీలను అందించాలి. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) అనే ఆన్‌లైన్‌ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్‌ రూపంలో సేవ్‌ చేస్తారు. ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్‌లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్‌ చేయొచ్చు. ఫిజికల్‌ కాపీలతో పోలిస్తే పత్రాలు కోల్పోయే ప్రమాదం తక్కువ. పాలసీ వివరాలు, పునరుద్ధరణ తేదీలను ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు. పాలసీలో చిరునామా మార్చాలన్నా, వివరాలు అప్‌డేట్‌ చేయాలన్నా ఇ-ఇన్సూరెన్స్‌తో చాలా సులభం.