ఏడాదిలో పెట్రోల్ రేట్లను మోడీ ప్రభుత్వం ఎంత పెంచిందో తెలుసా?

ప్ర‌పంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ పై భార‌త ప్ర‌భుత్వం ప‌న్నులు విధిస్తోంది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఆయిల్ ధ‌ర‌లు సామాన్యుడు అదిరిపోయేలా పెరిగాయి. గ‌త ఏడాది మే నెల ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీట‌‌ర్ పెట్రోలుపై 22.98 రూపాయాలు ఉండేదాన్ని ఒకసారిగా 32.98 రూపాయలు పెంచారు.

  • Written By:
  • Publish Date - October 19, 2021 / 04:33 PM IST

ప్ర‌పంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ పై భార‌త ప్ర‌భుత్వం ప‌న్నులు విధిస్తోంది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఆయిల్ ధ‌ర‌లు సామాన్యుడు అదిరిపోయేలా పెరిగాయి. గ‌త ఏడాది మే నెల ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీట‌‌ర్ పెట్రోలుపై 22.98 రూపాయాలు ఉండేదాన్ని ఒకసారిగా 32.98 రూపాయలు పెంచారు. అలాగే లీట‌ర్ డీజిల్ పైన 18.83 రూపాయాల నుంచి 31.83రూపాయ‌ల వ‌ర‌కు ప‌న్ను విధించారు. మోడీ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చే నాటికి పెట్రోలు మీద కేంద్రం విధించే ప‌న్ను రూ. 10.39 ఉండేది. ఇప్పుడు ఆ ప‌న్ను 32.90 రూపాయ‌ల‌కు చేరింది. అంటే, ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా 217శాతం ప‌న్ను వేయ‌డం మోడీ పాల‌న‌లోని హైలెట్ పాయింట్. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను కూడా జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొస్తే..వినియోగ‌దారుల‌కు ఉప‌శ‌మ‌నం ఉంటుంద‌ని ఆశ‌. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం అందుకు సిద్ధంగా లేదు.

2017 త‌రువాత ప్ర‌తి రోజూ ఆయిల్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది జూలై వ‌ర‌కు బ్యార‌ల్ ముడిచ‌మురు ధ‌ర స‌గ‌టున 43.35 డాల‌ర్లు ఉండేది. క్ర‌మంగా పెరుగుతూ జూలై 14 నాటికి 75.26 డాల‌ర్లు అయింది. అక్టోబ‌ర్ 18 నాటికి ముడిచ‌మురు బ్యార‌ల్ ధ‌ర 85 డాల‌ర్లకు చేరుకుంది. కేంద్రం, రాష్ట్రం ప్ర‌స్తుతం ల‌భిస్తోన్న పెట్రోలు, డీజిల్ పైన 57శాతం ప‌న్నుల‌ను వ‌సూలు చేస్తున్నాయి.అంత‌ర్జాతీయంగా పెరుగుతోన్న ధ‌ర‌లు, కేంద్రం, రాష్ట్రం విధిస్తోన్న ప‌న్నుల‌తో సామాన్యుడు హ‌డ‌లిపోతున్నాడు. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు క‌ళ్లెంలేని గుర్రంలా ప‌రుగెడుతున్నాయి.
దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీడ‌ర్ పెట్రోల్ రూ. 104దాటి పోయింది. అదే త‌ర‌హా డీజిల్ రూ 110ల‌ను దాటుకుని వెళ్లింది. ఎందుకు అనూహ్యంగా ధ‌ర పెరుగుతోంది. దానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల‌ను తెలుసుకుంటే..ఎక్క‌డ వినియోగ‌దారుల‌కు భారం ప‌డుతుందో అర్థం అవుతోంది. ప్ర‌ధానంగా ముడి చ‌ములు ఎగుమతి-దిగుమ‌తి ధ‌ర‌లు, డాల‌ర్ తో రూపాయ మార‌కం విలువ‌, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్నులు, ముడిచ‌ములు శుద్ధి చేసే కంపెనీల ఖ‌ర్చు, డీల‌‌ర్ చార్జీలు మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

2014 పూర్వం వ‌ర‌కు ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి ఆయిల్ కంపెనీలు ధ‌ర‌ల‌ను నిర్థారించేవి. ఆ త‌రువాత ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే ప‌ద్ధ‌తి అమ‌లు అవుతోంది. భార‌త్, ఇండియ‌న్, హిందూస్థాన్ త‌దిత‌ర ప్ర‌ధాన ఆయిల్ మార్కెటింగ్‌(ఓఎంసీలు) కంపెనీలు వివిధ ర‌కాల ప్ర‌మాణాల ప్ర‌కారం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తున్నాయి. లోక్ స‌భ నుంచి వ‌చ్చిన స‌మాధానం మేర‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర‌, ఎక్చేంజ్ ధ‌ర‌, ప‌న్నుల నిర్మాణం ఇత‌ర‌త్రా చిల్ల‌ర ఖ‌ర్చుల‌ను క‌లుపుకుని పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ నిర్ణ‌యం జ‌రుగుతుంది.
కేంద్రం పెట్రోలియం అండ్ నాచుర‌ల్ గ్యాస్ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డిచే పెట్రోలియం ప్లానింగ్ అంగ్ అనాలిసిస్ విభాగం ఈ ధ‌ర‌ల‌ను నిర్థేసిస్తుంది. విదేశాంగ విధానం, డిమాండ్-స‌ర‌ఫ‌రా మ‌ధ్య ఉండే వ్య‌త్యాసం, భ‌విష్య‌త్ నిల్వ‌లు, స‌ర‌ఫ‌రా తీరు ఆధారంగా ముడి చ‌మురు ధ‌ర నిర్థార‌ణ అవుతోంది. సొంత వాహ‌న‌దారుల ఆధారంగా ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది. ఫ‌లితంగా ధ‌ర‌ల పెరుగుద‌ల అనివార్యం అవుతోంది. కేంద్ర‌, రాష్ట్రాలు విధించే ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధారిత ప‌న్ను(వ్యాట్‌) కార‌ణంగా ధ‌ర‌ల పెరుగుద‌ల ఉంటోంది. డాల‌ర్ ధ‌ర బ‌ల‌ప‌డితే..అనుగుణంగా ఓఎంసీలు ఆయిల్ విక్ర‌యించే ధ‌ర‌ను పెంచుతాయి. దాని కార‌ణంగా కూడా ధ‌ర పెరుగుతోంది. ఓఎంసీ నిర్థారించే ధ‌ర ప్ల‌స్ ఎక్సైజ్ డ్యూటీ( కేంద్రం) ప్ల‌స్ డీల‌ర్ క‌మీష‌న్ ప్ల‌స్ వ్యాట్‌(రాష్ట్రం) వెర‌సి వినియోగ‌దారుల‌కు ల‌భించే ధ‌ర..ఇలా లెక్కించి స‌గ‌టు భార‌తీయుడు మోయ‌లేని భారాన్ని మోడీ ప్ర‌భుత్వం మోపుతోంది.