Site icon HashtagU Telugu

Developed Country: భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది..? ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..?

Developed Country

Nirmala Sitharaman

Developed Country: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక నివేదికలు వచ్చాయి. Glodman Sachs నుండి SBI వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాయి. అదే సమయంలో IMF భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను పెంచింది. ఇన్ని పాజిటివ్ రిపోర్టులు వచ్చిన తర్వాత కూడా భారత్ ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం (Developed Country)గా అవతరించనుందనే ప్రశ్న తరచూ తలెత్తుతుండగా.. పదే పదే అడిగే ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమాధానం ఇచ్చారు.

ఈ అంశాలపై దృష్టి

ఆర్థిక మంత్రి ప్రకారం.. భారతదేశం 2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరవచ్చు అన్నారు. వార్తా సంస్థ పిటిఐకి చెందిన ఒక వార్త ప్రకారం.. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది. దీని కోసం పని జోరుగా సాగుతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు. ఈ అంశాలు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సమగ్రత.

దేశంలో అన్ని వనరులున్నాయి

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని వనరులూ భారత్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసింది. దానితో పాటు భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువత జనాభా ఉంది. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వారిని నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

Also Read: Anand Mahindra : జింకలు, మనుషులని కలిపిన వర్షం.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..

ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది

స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నాలుగు విభిన్న అంశాలకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం మొదటి దృష్టి మౌలిక సదుపాయాలపై ఉంది. గత మూడు నుంచి ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వ వ్యయం రూ.10 లక్షల కోట్లకు చేరుతుంది.

మౌలిక సదుపాయాలతో పాటు పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగ భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్నోవేషన్ గురించి మాట్లాడుకుంటే ఎనర్జీ విషయంలో ఈ దిశగా చాలా కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో పథకాల ప్రయోజనాలు ప్రతి పౌరునికి చేరేలా ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసింది.