Largest Land Owner : మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూసంపద ఎవరికి ఉందో తెలుసా ? రియల్ ఎస్టేట్ కంపెనీలకో.. పారిశ్రామికవేత్తలకో భారీగా భూములు లేవు. వాటిని మించిన రేంజ్‌లో ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీగా భూములు ఉన్నాయి. 2017 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఈవివరాలను వెల్లడించారు. ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’కు సంబంధించిన వివిధ క్రైస్తవ ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థల సంఘాల యాజమాన్యంలో భూములు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ క్రైస్తవ మత సందేశాన్ని ప్రచారం చేస్తుంటాయి. ప్రజలకు ఉపయోగడే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటాయి. ప్రధానంగా విద్య, ఆరోగ్యపరమైన రంగాల్లో పేదలకు క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. దేశవ్యాప్తంగా ఉన్న ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’ భూముల మొత్తం విలువ చాలా ఎక్కువ. ఎంతో తెలుసా ? దాదాపు 20వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం భారతదేశ నావికాదళ బడ్జెట్ వ్యయానికి సమానం. మన దేశంలో ప్రభుత్వం తర్వాత ఎక్కువ మందికి జాబ్స్ ఇస్తున్న అతిపెద్ద వ్యవస్థ కూడా ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’నే(Largest Land Owner) కావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
- పశ్చిమాన గోవా, ఈశాన్య భారతదేశంలోని కోహిమా వంటి ప్రాంతాలతో సహా దేశంలోని వివిధ చోట్ల క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాకు చాలా స్థిరాస్తులు ఉన్నాయి.
- క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాకు 2457 హాస్పిటల్ డిస్పెన్సరీలు, 240 మెడికల్ లేదా నర్సింగ్ కళాశాలలు, 28 సాధారణ కళాశాలలు, 5 ఇంజనీరింగ్ కళాశాలలు, 3765 సెకండరీ పాఠశాలలు, 7319 ప్రాథమిక పాఠశాలలు, 3187 నర్సరీ పాఠశాలలు సహా అనేక రకాల సంస్థలు ఉన్నాయి.
- క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాకు విలువైన వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 2009లో వారు కేరళలో 123 కోట్ల రూపాయల విలువైన ప్లాంటేషన్‌ను కొన్నారు. క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాచే గణనీయమైన భూ సేకరణకు ప్రధానంగా 1927 నాటి భారతీయ చర్చిల చట్టంమే కారణమని చెబుతుంటారు. ఇది బ్రిటీషర్ల కాలం నాటి చట్టం.
- బ్రిటీష్ వాళ్లు యుద్ధాలలో భాగంగా దేశంలో వివిధ చోట్ల స్వాధీనం చేసుకున్న భూములను 1927 నాటి భారతీయ చర్చిల చట్టం ప్రకారం చర్చిలకు నామమాత్రపు రేటుకే లీజుకు ఇచ్చారని అంటారు.