Women’s Day : మహిళల ప్రాతినిధ్యం గురించి..

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 12:23 PM IST

 

Women’s Day: కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో గతంతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో ఎంత మెరుగుదల ఉందో తెలుసుకుదాం..

వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తే, గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరింత నిశితంగా గమనిస్తే ఆ గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

భారత్‌లో మహిళా శ్రామికశక్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ, అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆ తర్వాత వేల మంది మహిళలు పనులకు దూరమయ్యారు. ఇప్పటికీ పురుష కార్మికుల సంఖ్యతో సమానంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసంఘటిత రంగంలో కార్మికుల సంఖ్య గురించి కచ్చితమైన గణాంకాలు లేకపోవడాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపా సిన్హా ప్రస్తావించారు. గణాంకాలు లేకపోవడం వల్ల కార్మిక శక్తిలో లింగ ప్రాతినిధ్యాన్ని తెలుసుకోవడం క్లిష్టతరమని ఆమె అభిప్రాయపడ్డారు.

మహిళలు చదువుకోగలిగినప్పటికీ ప్రసవాలు, ప్రసూతి సెలవులు, సమాన వేతన సమస్యల వంటి కారణాలతో శ్రామిక శక్తిలో వారి ఉనికి సవాల్‌గా మారింది.

”చాలా మంది మహిళలు చదువు, లేదా ఉద్యోగాన్ని మధ్యలోనే ఆపేస్తారు. ఇష్టపూర్వకంగానైనా లేదా బలవంతంగానైనా. ఇది నాయకత్వ స్థానాల్లో వారి ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది” అని ఆమె బలంగా చెప్పారు.

నిర్ణయాధికారాలు ఉండే స్థాయికి రావడం రాత్రికి రాత్రే జరగదని, అయితే అన్ని కార్యాలయాల్లోనూ లింగపరమైన ఇబ్బందులు కలగని సురక్షిత ప్రదేశాలను సృష్టించడం కూడా చాలా కీలకమని ఆమె అన్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నత విద్యపై నిర్వహించిన సర్వేలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరంలో 29 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది.

read also :Imran Khan : ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా జైలుపై ఉగ్రదాడి.. ఏమైందంటే ?

1999లో లోక్‌సభలో మహిళా రాజకీయ నాయకుల సంఖ్య 49. అది 2019 నాటికి 78కి పెరిగింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల అనంతరం ఆ సంఖ్య మరింత పెరిగింది.

రాజ్యసభలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 2012 నుంచి 2021 మధ్య రాజ్యసభకు నామినేట్ అయిన మహిళల శాతం 9.8 శాతం నుంచి 12.4 శాతానికి పెరిగింది. ఇది మహిళా ప్రాతినిధ్యంలో పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

1999లో లోక్‌సభలో మహిళా రాజకీయ నాయకుల సంఖ్య 49. అది 2019 నాటికి 78కి పెరిగింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల అనంతరం ఆ సంఖ్య మరింత పెరిగింది.

రాజ్యసభలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 2012 నుంచి 2021 మధ్య రాజ్యసభకు నామినేట్ అయిన మహిళల శాతం 9.8 శాతం నుంచి 12.4 శాతానికి పెరిగింది. ఇది మహిళా ప్రాతినిధ్యంలో పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.