RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

  • Written By:
  • Updated On - April 1, 2024 / 01:59 PM IST

RBI: భారతదేశంలో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పర్యవేక్షించే సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర బ్యాంకు సేవలు ప్రారంభమై 90 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని(90th Anniversary) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సోమవారం ప్రత్యేక నాణేన్ని(special coin) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇతర ఆర్బీఐ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక రూ.90 విలువ గల నాణేన్ని ఆవిష్కరించింది. దీన్ని 99.99% స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. 40 గ్రాములున్న ఈ స్మారక నాణెం తొమ్మిది దశాబ్దాల ఆర్బీఐ గొప్ప చరిత్ర, విజయాలను సూచిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నాణెం మధ్యలో ఆర్బీఐ చిహ్నం ఉంటుంది. దాని క్రింద RBI@90 అని అక్షరాలు ముద్రించారు. ఇది సంస్థ దీర్ఘకాల చరిత్రను, భారతదేశ ఆర్థిక శక్తిలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. దీనిపై ఉండే అశోక స్తంభం, లయన్‌ క్యాపిటల్‌, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక. జాతీయ నినాదం సత్యమేవ జయతే అని కాయిన్‌ కింద భాగంలో దేవనగరి లిపిలో రాశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మన దేశ కేంద్ర బ్యాంకుగా పనిచేస్తుంది. సెంట్రల్ బ్యాంకింగ్ సర్వీస్‌లను 1900ల ప్రారంభంలో స్థాపించారు. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 (II ఆఫ్ 1934) ప్రకారం.. ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1న అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించింది.

Read Also: Hyderabad : ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు.. హైదరాబాద్‌కు ‘జల’గండం!

రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్ల ముద్రణను నియంత్రిస్తుంది. స్థిరమైన డబ్బు విలువను నిర్ధారించడానికి రిజర్వ్స్‌ మెయింటైన్‌ చేస్తుంది. కంట్రీ క్రెడిట్, కరెన్సీ వ్యవస్థ ప్రయోజనం పొందేలా చూస్తుంది. ప్రారంభంలో, కంట్రోలర్ ఆఫ్ కరెన్సీ నుంచి ఆర్బీఐ పనులు చేపట్టింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ ఖాతాలు, రుణాలను నిర్వహించింది. ఆ తర్వాత ఆర్బీఐ దేశ అభివృద్ధి, వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించింది. 1960లలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫైనాన్స్‌ను ఉపయోగించుకోవడానికి మార్గం చూపింది.

ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, డిస్కౌంట్ అండ్‌ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను స్థాపించింది. తద్వారా సంస్థాగత అభివృద్ధిని ప్రోత్సహించడంలో బ్యాంక్ కీలక పాత్ర పోషించింది. ఈ కార్యక్రమాలు దేశ ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి.

Read Also: Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. చాలా ప్రపోజల్స్ వచ్చాయి : ప్రభాస్

లిబరలైజేషన్‌ తరువాత ఆర్బీఐ తన దృష్టిని ద్రవ్య విధానం, బ్యాంక్ పర్యవేక్షణ, నియంత్రణ, చెల్లింపుల వ్యవస్థ పర్యవేక్షణ వంటి ప్రాథమిక కేంద్ర బ్యాంకింగ్ పనులపైకి మళ్లించింది. అదే సమయంలో ఆర్థిక మార్కెట్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా ప్రపంచ దేశాల్లో బలమైన సెంట్రల్ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు సాధించింది.

Follow us