10 Lakhs Fine : ఐటీఆర్‌లో ఇవి నింపకుంటే 10 లక్షల ఫైన్‌

10 Lakhs Fine : ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజుల పాటు ఇండియాలో ఉన్నట్లయితే.. అతన్ని రెసిడెంట్‌గా పరిగణిస్తారు.

  • Written By:
  • Updated On - February 28, 2024 / 11:16 AM IST

10 Lakhs Fine : ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజుల పాటు ఇండియాలో ఉన్నట్లయితే.. అతన్ని రెసిడెంట్‌గా పరిగణిస్తారు. భారతీయ నివాసి విదేశాల్లో సంపాదించే ఆదాయం కూడా భారతదేశ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి వర్తించే పన్ను రేట్లే అతడికి కూడా అప్లై అవుతాయి. ఇలాంటి వాళ్లు తప్పకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయాలి.  విదేశాల్లో అందుకున్న జీతాన్ని ఐటీఆర్ ఫామ్‌లో  ‘ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ’ విభాగం కింద  చూపించాలి. విదేశీ కరెన్సీలో వచ్చే జీతాన్ని రూపాయిల్లోకి మార్చి ఫామ్‌లో రాయాలి. పని చేస్తున్న కంపెనీ వివరాలను కూడా సమర్పించాలి. జీతంపై ముందస్తు టాక్స్‌ కట్‌ అయితే.. దాన్ని కూడా ఐటీ రిటర్న్‌లో రాయాలి. ఇలా చూపిస్తే.. రీఫండ్‌  కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ‘డబుల్ ట్యాక్సేషన్ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్’ (DTAA) బెనిఫిట్‌ ద్వారా రెండు దేశాల్లోనూ పన్ను కట్టాల్సిన ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. మీరు పని చేస్తున్న దేశంతో భారత్‌కు DTAA లేకపోతే.. సెక్షన్ 91 ప్రకారం తప్పకుండా ఉపశమనం పొందొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

సెక్షన్‌ 80C లేదా 80D కింద పెట్టిన పెట్టుబడులకు పన్ను మినహాయింపులను పొందొచ్చు. అయితే విదేశాల్లో పొందే డిడక్షన్స్‌ను ఇక్కడ ఉపయోగించుకోలేరు. విదేశాల్లోనూ మీరు సంపాదిస్తుంటే.. ఆదాయ పన్ను పత్రాల్లో FA (ఫారిన్‌ అసెట్స్‌) గురించి సమాచారం ఇవ్వాలి. మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి లేదా బ్యాంకు అకౌంట్‌ ఉంటే.. దాని గురించి ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సరైన సమాచారం అందించాలి. ఒకవేళ మీరు సమాచారం దాచారని బయటపడితే ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి తప్పకుండా నోటీసు అందుతుంది.  ఆదాయ పన్ను విభాగం విదేశాల్లో సంపాదన గురించి టాక్స్‌ పేయర్లను ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేస్తూ ఉంటుంది. దేశం వెలుపల బ్యాంక్ ఖాతా, ఆస్తులు, ఆదాయం వంటివి ఉంటే 2023-24 ఆర్థిక సంవత్సరం/ 2024-25 మదింపు సంవత్సరం కోసం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా ‘ఫారిన్‌ అసెట్స్‌ షెడ్యూల్‌’ పూరించాలంటూ ఐటీ డిపార్ట్‌మెంట్‌ పదేపదే సూచిస్తోంది. ఒకవేళ విదేశీ సంపాదనల గురించి టాక్స్‌ పేయర్‌ వెల్లడించకపోతే, ఆదాయ పన్ను విభాగం అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. బ్లాక్ మనీ  & ట్యాక్స్‌ యాక్ట్‌ – 2015 కింద రూ. 10 లక్షల వరకు జరిమానా (10 Lakhs Fine)  విధిస్తారు.

Also Read : Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు

ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్ల ఐటీఆర్‌ ఫైలింగ్ ఇలా..

  • జీతం తీసుకునే ట్యాక్స్‌ పేయర్ల  విషయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ చాలా సులభంగా ఉంటుంది.
  • శాలరీడ్‌ పర్సన్స్‌ ITRలో తికమకలు, తలనొప్పులు ఉండవు. పైగా, ప్రి-ఫిల్డ్‌ ఐటీ ఫామ్స్‌ వచ్చాక వాళ్ల పని ఇంకా సింపుల్‌గా మారింది.
  • ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా పని చేస్తున్న వాళ్ల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో బాగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ల ITR దాఖలు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. శాలరీడ్‌ టాక్స్‌పేయర్‌లా ITR-1 లేదా ITR-2ను ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌ ఫైల్ చేయలేడు.
  • ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌ ఆదాయం జీతం నుంచి రాదు కాబట్టి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్‌ కూడా పొందలేడు.
  • ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా ఏడాది పొడవునా సంపాదించిన మొత్తాన్ని బట్టి స్లాబ్ స్టిస్టమ్‌, పన్ను రేటు వర్తిస్తుంది.
  • జీతం తీసుకునే వ్యక్తుల్లా ప్రతి సంవత్సరం ఇష్టమైన పన్ను విధానాన్ని (Tax Regime) వీళ్లు ఎంచుకోలేరు.

Also Read : Pawan Kalyan Hari Hara Veeramallu : రెండు భాగాలుగా వీరమల్లు.. పవర్ స్టార్స్ ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చిన నిర్మాత..!