Colon Cancer: కొలోన్ క్యాన్సర్ సంకేతాలు ఇవీ..

ఇతర కాన్సర్లతో పోలిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ డిఫరెంట్. ఇది కొలోన్ (పెద్ద పేగు) లో కానీ.. పురీష నాళం( రెక్టం )లో కానీ స్టార్ట్ అవుతుంది.

  • Written By:
  • Updated On - February 5, 2023 / 10:15 PM IST

Colon Cancer: ఇతర కాన్సర్లతో పోలిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ డిఫరెంట్. ఇది కొలోన్ (పెద్ద పేగు) లో కానీ.. పురీష నాళం( రెక్టం )లో కానీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్న దాన్ని బట్టి అది కొలోన్ క్యాన్సరా? రెక్టం క్యాన్సరా? అనేది డిసైడ్ అవుతుంది. పెద్ద ప్రేగు అనేది మన శరీరంలోని డైజెస్టివ్ ట్రాక్ట్‌లో ఓ భాగం. రెక్టం అనేది పెద్ద ప్రేగు దగ్గర మొదలై మలద్వారం వద్ద ముగుస్తుంది.
కొలోన్ కాన్సర్, రెక్టం కాన్సర్ రెండింటిని కలిపి కొలొరెక్టల్ కాన్సర్ అని అంటారు. ఎందుకంటే ఈ రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి.ఈ కాన్సర్‌లకు ప్రీ క్లినికల్ పీరియడ్ ఎక్కువకాలం ఉంటుంది. త్వరగా డిటెక్ట్ చేయగలిగితే దీన్ని క్యూర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అందువల్లే ఎర్లీ స్క్రీనింగ్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. కొలొరెక్టల్ కాన్సర్ కొరకు చేసే స్క్రీనింగ్ లో బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, కొలొనోస్కోపీ వంటివి ఉంటాయి.పురుషులు ఎక్కువగా రెక్టల్ కాన్సర్ బారిన పడతారు. కొలోన్ కాన్సర్ వల్ల మరణించే వారిలో స్త్రీల శాతం కంటే పురుషుల శాతం ఎక్కువ.

■ ఇలా వస్తుంది..

కొలోన్ లేదా రెక్టం యొక్క లోపలి పొర వద్ద కొలొరెక్టల్ కాన్సర్ కు సంబంధించిన చిన్న గడ్డలు ఏర్పడుతాయి. వీటిలో కొన్ని గడ్డలు కొంత కాలానికి కాన్సర్‌లా మారొచ్చు. కొలోన్ కాన్సర్ ట్రీట్మెంట్ లో ట్యూమర్ తీసివేయడానికి సర్జరీ చేస్తారు. కాన్సర్ ఏ స్టేజ్ లో ఉందన్న దాన్ని బట్టి రేడియేషన్, కీమోథెరపీలు నిర్వహిస్తారు. ఇంతకు మునుపు, పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కొలొరెక్టల్ క్యాసర్ ఎక్కువగా కనిపించేది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, అధిక బరువు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ కేసుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది.

■ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు

◆ మలంలో లేదా పురీషనాళం నుంచి రక్తం వస్తుంది.

◆ కడుపు నొప్పి కలుగుతుంది.

◆ రక్తహీనతతో బాధపడుతారు.

◆ కడుపులోని లైనింగ్ లో వాపు , ప్రేగులో రంధ్రం ఏర్పడొచ్చు.

జాగ్రత్తలు ఇవీ..

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
2. ఆల్కహాలిక్ బెవరేజెస్ ని పూర్తిగా ఎవాయిడ్ చేయాలి.
3. పొగ తాగడం ఆపేయాలి.
4. ఆరోగ్యకరమైన బరువు మెయింటెయిన్ చేయాలి.
5. 40 ఏళ్ళ తరువాత కొలోన్ కాన్సర్ కొరకు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఈ వ్యాధి ఉన్నట్లైతే ఇంకా ముదే స్క్రీనింగ్ చేయించుకోవాలి.