Flatulence: అపాన‌వాయువు ఆపుకుంటున్నారా ?ఇది తెలుసుకోండి..

రోజుకు 10 నుంచి 14 సార్లు అపాన వాయువు వ‌ద‌ల‌డం ఆరోగ్య‌క‌ర‌మేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అపాన‌వాయువు (Flatulence) దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయం. ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయం. వాస్తవానికి అపాన వాయువు కూడా మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. రోజుకు 10 నుంచి 14 సార్లు అపాన వాయువు వ‌ద‌ల‌డం ఆరోగ్య‌క‌ర‌మేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు 20 సార్ల‌కు మించి ఆ వాయువు వ‌స్తుంటే క‌నుక జీర్ణ‌వ్య‌వ‌స్థ అనారోగ్యం బారిన ప‌డిన‌ట్లు అర్థం చేసుకోవాలి. మనం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌ను జీర్ణ‌వ్య‌వ‌స్థ జీర్ణం చేస్తుంది. వాటిల్లో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అందేలా చేస్తుంది. జీర్ణ‌క్రియ‌లో భాగంగానే అప్పుడ‌ప్పుడు జీర్ణాశ‌యం, పేగుల్లో గ్యాస్ ఉత్ప‌త్తి అవుతుంది. ఆ గ్యాసే అపాన‌వాయువు (Flatulence) రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది.

గట్ బ్యాక్టీరియా ఫైబర్‌ను పులియబెట్టినప్పుడు..

పెద్ద పేగులలోని గట్ బ్యాక్టీరియా మనం తిన్న ఫుడ్ లోని ఫైబర్‌ను పులియబెట్టినప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇందులో హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ వంటి వాయువులు ఉంటాయి. ఇదే అపాన వాయువు రూపంలో మనం రిలీజ్ చేస్తాం. న‌లుగురిలో ఉన్న‌ప్పుడు అపాన వాయువు వ‌దిలేందుకు చాలా మంది సిగ్గు ప‌డుతుంటారు. కానీ అలా సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అది స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియ‌. దీంతో మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సాధారణంగా జీర్ణాశ‌యంలో గ్యాస్ చేర‌డం వ‌ల్ల క‌డుపునొప్పి వ‌స్తుంది. అయితే అపాన‌వాయువును వ‌దిలితే గ్యాస్ పోయి నొప్పి త‌గ్గుతుంది. ముఖ్యంగా అపాన‌వాయువు రిలీజ్ అయితే మన బాడీలోని పెద్దపేగు క్లీన్ అవుతుంది. పెద్దపేగు చాలా ముఖ్యం, అందులోనే మన గట్ బాక్టీరియా ఉంటుంది. ఇది మనం తిన్న ఫుడ్ ను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఫుడ్ జీర్ణం కానప్పుడు.. ఫుడ్ అలర్జీ ఉన్నపుడు

  1. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు త్వరగా జీర్ణం కానప్పుడు గ్యాస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో అపాన వాయువు ఎక్కువ‌గా విడుదల అవుతుంది.
  2. కొన్ని ర‌కాల ఆహారాలు కొంద‌రికి ప‌డ‌వు. దాన్నే ఫుడ్ అల‌ర్జీ అంటారు. ఇలాంట‌ప్పుడు కొంద‌రికి అపాన వాయువు ఎక్కువ‌గా వ‌స్తుంది. దీంతో మ‌ళ్లీ ఆ ఆహారాల‌ను తిన‌కూడ‌ద‌ని అర్థం.

వదలకుండా ఆపితే..

ఒకవేళ మీరు అపానవాయువును బయటికి వదలకుండా ఆపితే ఏమవుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటప్పుడు గ్యాస్ మీ పెద్ద పేగులలోనే ఉండిపోతుంది. గట్ అనేది ఒక పొడవైన గొట్టం. దీనివల్ల మీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి . ఇది మీ శరీరంలో ఉబ్బరం కలిగిస్తుంది. మీ బొడ్డు ప్రాంతం బెలూన్ లాగా ఉబ్బుతుంది. మీ గట్ గ్యాస్ తో ఉబ్బుతుంది. కడుపు నొప్పి కూడా వస్తుంది. మీరు అపుకున్న అపాన వాయువు నేరుగా గట్ నుంచి మీ ఊపిరితిత్తులకు ప్రయాణించ గలదు. మీరు ఆపేసిన అపాన వాయువులో కొంత భాగం గట్ గోడ ద్వారా మీ రక్తప్రవాహంలోకి శోషించబడుతుంది.

వాసన ఎక్కువ ఉంటే.. తక్కువ ఉంటే.. లేకుంటే..

  1. వాస్తవానికి అపానవాయువు లో వాసన లేని వాయువులు 99 శాతం, 1 శాతం సాధారణంగా సల్ఫర్‌ తో ఉంటాయి.
  2. వాసన లేని అపాన వాయువులు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉందని సూచిస్తాయి.
  3. అపానవాయువులో కుళ్ళిన గుడ్ల వాసన వస్తే మీ జీర్ణవ్యవస్థలో ఏదో జరుగుతోందని అనుమానించాలి. ఫుడ్ అలర్జీ, అధిక-ఫైబర్, అధిక సల్ఫర్ ఆహారాలు, కొన్ని మందులు, యాంటీబయాటిక్స్, ఇతర వ్యాధుల వల్ల ఇలాంటి వాసన వస్తుంది.
  4. సోడా, కోలా, బూజ్, బీరు తాగితే రోజులో ఎక్కువసార్లు అపానవాయువు వస్తుంది.
  5. మహిళల్లో ఋతుస్రావం సమయంలో హార్మోన్ స్థాయిలు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది అనేక జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ యొక్క అధిక స్థాయిలు తరచుగా గ్యాస్, మలబద్ధకానికి దారితీయవచ్చు.

Also Read:  Swiggy: స్విగ్గీ పార్శిల్‌లో నకిలీ రూ.2,000 నోట్లు చూసి షాక్ అయిన కస్టమర్లు