Cough: కఫం దగ్గు.. పొడి దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు

కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యల వల్ల కూడా వస్తుంది. కారణం లేకుండా పొడి దగ్గు వస్తుంటే అది మీ నిద్రను పాడు చేస్తుంది.

దగ్గు (Cough) రావడం అనేది సర్వసాధారణం. ఇది ఎక్కువగా వచ్చినప్పుడే అసలు సమస్య. దగ్గు రెండు రకాలు. ఒకటి కఫంతో కూడిన దగ్గు.. రెండోది కఫం లేకుండా వచ్చే పొడి దగ్గు. ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. పొడి దగ్గు (Dry Cough) అనేది ఉబ్బసం, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్, పోస్ట్‌ నాసల్ డ్రిప్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, పొగ, కాలుష్యం, దుమ్ము పుప్పొడి వంటి వాటి వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యల వల్ల కూడా వస్తుంది.కారణం లేకుండా పొడి దగ్గు వస్తుంటే అది మీ నిద్రను పాడు చేస్తుంది. పొడి దగ్గుని (Dry Cough) తగ్గించే పవర్‌ ఫుల్ ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె

పొడిదగ్గుని దూరం చేసేందుకు చాలా మంది తేనెని వాడతారు. దీని వల్ల సమస్య చాలా వరకూ దూరమవుతుంది.1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మ రసం కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేయొచ్చు. ఈ కాంబినేషన్ నచ్చకుంటే ఓ కప్పు వేడి నీరు, హెర్బల్ టీలో తేనె వేసి రోజుకి రెండు సార్లు తాగొచ్చు. అయితే సంవత్సరంలోపు వయసున్న వారికి తేనెని ఇలా ఇవ్వొద్దు.

ఆపిల్ సైడర్ వెనిగర్

అరకప్పు ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి మరిగించి స్టౌ పై పెట్టి దించాలి. మీ తలపై టవల్ వేసి, నోరు, కళ్లు మూసుకుని మీ ముక్కుతో 3 నుంచి 5 నిమిషాల పాటు ఆవిరి పీల్చుకోండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయొచ్చు.

పుక్కిలించండి

3 టీ స్పూన్ల ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్‌లో, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి దీనిని ఓ కప్పు గోరువెచ్చని నీటికి కలపండి. దీంతో రోజుకి 2 లేదా 3 సార్లు పుక్కిలించండి.

అల్లం

పొడి దగ్గుకు అల్లం కూడా బాగా పనిచేస్తుంది. ఇది శ్లేష్మం, కఫాన్ని దూరం చేస్తుంది. అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి నలపండి. పాన్‌లో టీస్పూన్ అల్లం ముక్కలు 1 కప్పు నీరు పోసి మరిగించి వడకట్టండి. రోజుకి 3 సార్లు ఈ నీటిని తాగాలి.

అమరాంత్

పొడి దగ్గు ఉంటే ఉసిరికాయ, చండామృత్ రాస్ ను ఉదయం, సాయంత్రం నీటితో తీసుకోవాలి.

తులసి టీ

6-7 తాజా తులసి ఆకులు, 1 అల్లం ముక్క, 2 టీస్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 పచ్చి ఏలకులు, 2 1/2 కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా నీటిని మరిగించాలి. ఆ తరువాత ఆకులతో సహా అన్నింటినీ మరిగే నీటిలో యాడ్ చేయాలి. 2-3 నిమిషాలు పాటు వీటిని మరిగించాలి. ఆపై స్టవ్ కట్టేసి తులసి టీని తాగవచ్చు.

నల్ల మిరియాలు

నల్ల మిరియాల్ని మిక్సీలో పొడిలా చేసుకొని.. కూరల్లో వాడితే.. చేదు అనిపించవు. కారం కాస్త తగ్గించి.. ఈ పొడి వేసుకోవచ్చు. వీటివల్ల దగ్గు తగ్గుతుంది . తలలో చుండ్రు సమస్య కూడా పరిష్కారం అవుతుంది.

ఇంగువ, త్రిఫల

ఇంగువ, త్రిఫల, జామపండు, పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. త్రిఫల, తేనెను కలిపి తీసుకున్నా దగ్గు తగ్గుతుంది.

ఎండుమిర్చి, ఎండు శొంఠి, జామకాయల పొడి

ఎండుమిర్చి, ఎండు శొంఠి, జామకాయల పొడిని తయారు చేసుకోండి.దగ్గు బాగా ఉన్నప్పుడు దీన్ని ప్రతిరోజు నాలుగో వంతు తేనెతో కలిపి తీసుకోండి.

తమలపాకులు నమలడం

తమలపాకులు నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది.

కరక్కాయ పొడి

కరక్కాయ పొడి దగ్గును తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మరసం, తేనె, చిటికెడు పసుపు

పొడి దగ్గు తగ్గాలంటే నిమ్మరసం, తేనె, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని కూడా మూడు పూటలా తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

సొంఠి పొడి

అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది అని చెబుతున్నారు.

ఎత్తు ఎక్కువ పెట్టుకొని పడుకోవడం

దగ్గుతో బాధపడేవారు రాత్రి సమయాల్లో విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాంటి వారు రాత్రి సమయాల్లో తలకింద ఎత్తు ఎక్కువ పెట్టుకొని పడుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

Also Read:  G20: మొదటి G20 సమావేశంలో, ఆర్థిక మంత్రులు గ్లోబల్ ఎకానమీ, రుణాలపై చర్చించారు