Drinking Water: నీటిని ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదంలో పడ్డట్టే?

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, తగినంత నీరు కూడా తాగాలి. తగినంత నీరు తాగకపోవడం వల్ల అనేక రకాల

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 05:15 PM IST

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, తగినంత నీరు కూడా తాగాలి. తగినంత నీరు తాగకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలా అని చాలామంది నీటిని తెగ తాగేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు తాగితే ఏమవుతుందని అనుకుంటున్నారా! మరి అతిగా నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇతర పదార్థాలు మాదిరిగానే నీటిని అధికంగా తీసుకోవడం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

నీటిని అవసరమైన దానికంటే ఎక్కువగా తాగడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుంది. ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గుండె మరింత భారం వేసి కడుపులో మంటను పెంచిందని చెప్తున్నారు. ఎక్కువ నీరు త్రాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్ సామర్థ్యత దెబ్బ తింటుంది. హైపో నాట్రేమియా ద్వారా శరీరంలోని తలనొప్పి, వికారం, బలహీనత, చికాకు కండరాలు తిమ్మిరి మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకరోజులో ఎంత నీటిని తాగాలి అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు 9 నుండి 13 గ్లాసులు నీటిని తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగడం వలన రక్తంలో సోడియం ఎలక్ట్రోలైట్లు పల్చబడతాయి .దీని కారణంగా శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది.

శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల కండరాలు తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గుతుంది. దీని వలన చాలాసేపు విరోచనాలు, చమటలు పట్టడం అలాగే తరచుగా జీర్ణం ప్రభావితం చేస్తుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది. గుండె కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వలన ఎక్కువ మూత్రం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగినప్పుడు కిడ్నీ నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. కావున తరచుగా మూత్రవిసర్జన చేయడం వలన కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతారు..

Follow us