Cholestrol: కొలెస్ట్రాల్ మన బాడీకి అవసరమే..అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 07:15 AM IST

మనిషి శరీరంలో ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తత అవసరం. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉంది.. ? అనేది గమనిస్తుండాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్ర‌ణ‌లో పెట్టుకోవాలి. అలా అని
కొలెస్ట్రాల్ పేరు వింటే భయపడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ రెండు రకాలు.మంచి కొలెస్ట్రాల్ ను హెచ్‌డీఎల్ (High-Density Lipoprotein) అంటారు. చెడు కొలెస్ట్రాల్ ను
ఎల్‌డీఎల్ ( Low-Density Lipoprotein) అంటారు. అందుకే మనం మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ ను పెంచే ఆహార పదార్థాలు, నూనెలు వాడాలి. మరిన్ని వివరాలు ఇవి..

* గుండెపోటుకు దారి..

కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం, అయితే అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ మోతాదు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో, రక్త నాళాలలో కొవ్వు నిల్వలను పెంచుతుంది. చివరికి, ఈ కొలెస్ట్రాల్‌ నిల్వలు పెరిగి, ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఫలితంగా గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణమయ్యే గడ్డను రక్త నాళాల్లో ఏర్పరుస్తాయి.

* 3 రకాల కొవ్వులు..

మ‌న శ‌రీరంలో ఉండే కొవ్వు 3 ర‌కాలు. హెచ్‌డీఎల్‌, ఎల్‌డీఎల్‌తోపాటు ట్రై గ్లిజ‌రైడ్స్ అనే రకం కొవ్వు కూడా బాడీలో ఉంటుంది. ఎల్‌డీఎల్ లాగే ట్రై గ్లిజ‌రైడ్స్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.
లిపిడ్ ప్రొఫైల్ టెస్టు చేయిస్తే.. ఇవి మన బాడీలో ఎంత మోతాదులో ఉన్నాయో తేలిపోతుంది.

* ఈ ఫుడ్ తో .. బీ కేర్ ఫుల్

కొవ్వు ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలు, వేపుళ్లు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, చిరు తిళ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. ఇది మంచిది కాదు. ఎర్ర మాంసం , పూర్తి కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, కాల్చిన కుకీలు , క్రాకర్లు , మైక్రోవేవ్ పాప్‌కార్న్ తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.సాధ్యమైనంతవరకు బయటి తిళ్లు ముఖ్యంగా శెనగపిండితో చేసే బజ్జీలు, పకోడీ, మసాలా పదార్ధాలు, ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉంటే.. కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు.

* ఈ ఫుడ్ తో .. బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్

పండ్లు, తాజా కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, స్కిన్ లెస్ చికెన్‌, చేప‌లు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, అవిసె గింజలు, బాదంప‌ప్పు, ప‌ప్పు దినుసులు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, ముప్పును తగ్గిస్తాయి. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

* ఊబకాయం

30 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ) కలిగి ఉండటం వల్ల మీకు అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది.

* వ్యాయామం లేకపోవడం

మీ ఎల్‌డిఎల్ లేదా “చెడు” కొలెస్ట్రాల్‌ను తయారుచేసే కణాల పరిమాణాన్ని పెంచేటప్పుడు మీ శరీరం యొక్క హెచ్‌డిఎల్ లేదా “మంచి” కొలెస్ట్రాల్‌ను పెంచడానికి వ్యాయామం సహాయపడుతుంది.

* ధూమపానం

ధూమపానం మీ రక్త నాళాల గోడలను దెబ్బతీస్తుంది. తద్వారా కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. ధూమపానం మీ హెచ్‌డిఎల్ స్థాయిని లేదా “మంచి” కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.

* డయాబెటిస్

రక్తంలో అధిక చక్కెర ఉంటే
చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (VLDL) .. low HDL కొలెస్ట్రాల్ అనే ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తంలో అధిక చక్కెర మీ ధమనుల పొరను కూడా దెబ్బతీస్తుంది.

కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు..

* శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే కాళ్లలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటే కాళ్లు ఉన్నట్టుండి తిమ్మిరెక్కుతుంటాయి.

* కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కన్పించే ప్రధాన లక్షణం గుండెపోటు. ముందుగా ఆర్టరీస్‌లో బ్లాకేజ్ రావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇదే గుండెపోటుకు కారణమౌతుంది.

* కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. బీపీ పెరుగుతుందంటే..కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని అర్ధం.

* కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గోర్ల రంగు మారుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. గోర్ల రంగు లేత గులాబీ రంగులో కన్పిస్తాయి.