Tiruchendur Vibhuti Mahima : కుజదోశంతో పాటు ఇతర గ్రహదోషాలు, దీర్ఘకాలిక రోగాలు మాయం

తిరుచెందూర్ ప్రధానంగా ఒక ఆలయ పట్టణం. "తిరుచెందూర్" (Tiruchendur) లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు.

Tiruchendur Vibhuti Mahima : తిరుచెందూర్ ప్రధానంగా ఒక ఆలయ పట్టణం. దీనిలో అందమైన దేవాలయాలు , తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, వల్లి గుహ లేదా దత్తాత్రేయ గుహ కలవు. టెంపుల్స్ మాత్రమే కాక ఇతర ఆకర్షణలలో పంచాలంకురిచి కోట, మేలపుతుకూది, కుదిర తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (Tiruchendur Sri Subrahmanya Swamy) వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం.

ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

“తిరుచెందూర్” (Tiruchendur) లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు..

“తిరుచెందూర్” లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు.

సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం

చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ (Tiruchendur) లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే..

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.

ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా..

ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరు దివ్యవమైన క్షేత్రములను తమిళనాడులోని ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా తిరుచెందూర్, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొళై, పళని , స్వామిమలై, తిరుత్తణి. నాగదోషం ఉన్నవారు, ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కార్యములు నెరవేరుతాయి. అంతే కాక, కుజగ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు.

రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ:

సాధారణంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలన్ని కూడా కొండపైన కొలువై ఉంటే, తిరుచెందూర్ (Tiruchendur) క్షేత్రం మాత్రం సుముద్రపు ఒడ్డున అలరారుతోంది. రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉన్నది. మూడు వందల సంవత్సరాలకు పూర్వం, తిరువాయదురై మఠపు మహా స్నిదానపు దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి, ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట.

అయితే అతడు పేదవాడు కావడం వల్ల గోపుర నిర్మాణానికి వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామి వారి విభూతిని ఇచ్చాడట. కూలీలు ఆ విభూతినే మహాద్భాగ్యంగా భావించి వెళుతుండగా మార్గం మధ్యలో ఆ విభూతి బంగారు నాణేలుగా మారాయట.

ఇలా ప్రతి రోజూ జరుగుతూ రాజగోపునిర్మాణం ఆరు అంతస్తుల వరకూ..

ఇలా ప్రతి రోజూ జరుగుతూ రాజగోపునిర్మాణం ఆరు అంతస్తుల వరకూ పూర్తయిందట. సరిగ్గా ఆరవ అంతస్థు పూర్తికాగనే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం స్వామి దేశికాచార్యుని కలలో కనిపించి మిగిలిన నిర్మాణానికి సీతాపతి మరైక్కార్ అనే భక్తుని దగ్గరకు వెళ్లి, ఒక బుట్ట ఉప్పును తీసుకురమ్మనమని ఆదేశించాడట. దేశికామూర్తి స్వామి ఆదేశం మేరకు, సీతాపతి మరూక్కార్ దగ్గర ఓ బుట్టు ఉప్పు తీసుకుని వస్తుండగా, మార్గం మధ్యలో ఆ ఉప్పు కాస్త బంగారంగా మారిపోయిందట. ఆ బంగారు నాణేలతో దేశికామూర్తి మిగిలిన రాజగోపురాన్ని నిర్మించాడు.

అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వ నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఒక చిన్న బావి ఉంది. ఇది సాక్షాత్తు ఆ స్వామి వారే తవ్వారని ప్రతీతి.

ప్రధానాలయానికి 200 అడుగుల దూరంలో ఒక చిన్న బావి ఉంది. ఇది సాక్షాత్తు ఆ స్వామి వారే తవ్వారని ప్రతీతి. దీనిని నాయక్కనర్ (కుక్క బావి) అని పిలుస్తారు. ఈ బావి సముద్రానికి సమీపంలో ఉన్ననూ, ఇందులోని నీరు ఉప్పగా ఉండక, తియ్యగా ఉండటాన్ని ఇక్కడి వారు విశేషంగా చెప్పుకుంటారు.

అలాగే ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఓ గుహ ఉంది. దీనిని ‘వల్లీ గుహ ‘ అని పిలుస్తారు. ఈ గుహాలయంలో వల్లీ, దేవయాని అమ్మవార్లు కొలువై ఉన్నారు.

తిరుచెందూర్ (Tiruchendur) క్షేత్రం యొక్క మరో లీల ఏమిటంటే..?

ఈ క్షేత్రం యొక్క మరో లీల ఏమిటంటే 2006లో వచ్చిన సునామి వల్ల ఇక్కడ ఎవ్వరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు . అది స్వామి వారి శక్తి.

తిరుచెందూర్ విభూతి మహిమ (Tiruchendur Vibhuti Mahima):

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే , ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయం అవుతాయి. ఎంతో మందికి అనుభవంలోకి వచ్చాయి స్వామి వారి లీలలు. నమ్మిన వాడికి నమ్మినంత.. అన్నారు పెద్దలు.

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి?

బస్సు/ రోడ్డు ద్వారా : చెన్నై, మధురై, తిరునల్వేలి, త్రివేండ్రం మరియు కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కలవు.

రైలు ద్వారా : తిరుచందూర్ కు సమీపాన 60 km ల దూరంలో తిరునల్వేలి జంక్షన్, 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు.

విమానం ద్వారా : సమీపాన 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే 150 km ల దూరంలో త్రివేండ్రం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా కలదు

Also Read:  Rameshwaram Jyotirlingam : త్రేతాయుగం నాటి క్షేత్రం.. సీతారాములు పూజించిన శివలింగం.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..